వైఎస్సార్‌సీపీ అభ్యర్థులకు బీ-ఫారాల పంపిణీ
పలమనేరు సూర్య మేజర్ న్యూస్ ;పలమనేరు వైఎస్సార్‌సీపీ కార్యాలయంలో పెద్దపంజాణి, గంగవరం, పలమనేరు రూరల్, బైరెడ్డిపల్లి, వీ.కోట మండలాలకు చెందిన జడ్పీటీసీ, ఎంపీటీసీ అభ్యర్థుల బీ-ఫారాలను చిత్తూరు జిల్లా పార్టీ అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే వెంకటగౌడ ఆయా మండలాల నాయకులకు అందజేశారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ అభ్యర్థుల విజయానికి నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో పనిచేయాలని, ప్రజల్లోకి వెళ్లి పార్టీ ఆశయాలను వివరించాలని ఆయన పిలుపునిచ్చారు.
రీపోటర్ : అనిల్ కుమార్ యాదవ్