BREAKING
ప్రతి నీటి బొట్టు ను ఒడిసి పట్టాలి -వరంగల్ జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద చివరి రెండు రోజులు సందడిగా మారిన ‘షీ-2026’ చేనేత వస్త్ర ప్రదర్శన చేనేత చీరల కొనుగోలుకు ఆసక్తి చూపిన వస్త్రాభిమానులు ఆధ్యాత్మిక ప్రచారుకులకు ఘన సత్కారం హరీష్ రావును మర్యాదపూర్వకంగా కలిసిన బీఆర్ఎస్ నేతలు ముద్రా థెరపీతో అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు.. చేతి వేళ్లతో రోగాలను నయం చేయవచ్చా! ఈ ఫ్లెక్సీ లకు ఎన్నికల కోడ్ వర్తించదా...! రూరల్ పోలీస్ స్టేషన్ కు ఎదురుగా కూటమి నేతల బ్యానర్లు వెంగళరావు నగర్‌లో పట్టభద్రుల ఓటరు నమోదు ​పరిశ్రమల ప్రమాదాలపై ప్రభుత్వం, అధికారుల నిర్లక్ష్యం బాధాకరం ​ఫ్యాక్టరీస్ ఇన్‌స్పెక్టర్లు, డైరెక్టర్ల ఖాళీలను తక్షణమే భర్తీ చేయాలి తోమాల సేవలకు జనార్ధన స్వామి చిత్రపటం అందజేత నవంబర్ 21న చెక్ బౌన్స్ కేసులపై లోక్ అదాలత్ -- న్యాయమూర్తి వాసంతి పట్టభద్రుల ఓటు నమోదు కోసం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ప్రత్యేక కౌంటర్ కివీస్‌తో మ్యాచ్‌లో చెలరేగిన తిలక్ వర్మ.. ఆరంభంలో ఆచితూచి ఆడి చివర్లో అద్భుత బ్యాటింగ్! ఎన్ఎండీసీ టీపీజీఎల్ సీజన్‌-6 గోల్ఫ్ టోర్నీ ప్రారంభం టీ-ఆఫ్ చేసి ప్రారంభించిన డీజీపీ సీవీ ఆనంద్‌ కడియం లో 115 నామినేషన్ శ్రీ భద్రకాళి అమ్మవారిని దర్శించుకున్న గరివిడి లక్ష్మి చిత్ర యూనిట్

నెల్లూరుపాలెంలో కూటమి ఐక్యత సాధించిన బొమ్మిరెడ్డి తారక్ నాథ్ రెడ్డి

Select Suryaa Now
నెల్లూరుపాలెంలో కూటమి ఐక్యత సాధించిన బొమ్మిరెడ్డి తారక్ నాథ్ రెడ్డి

ఆత్మకూరు, మేజర్ న్యూస్, సోమా వెంకటసుబ్బయ్య : ఆత్మకూరు మున్సిపాలిటీ పరిధిలోని నెల్లూరు పాలెం 27వ వార్డులో కూటమి ఐక్యతను బలోపేతం చేసేందుకు బొమ్మిరెడ్డి తారకనాథ్ రెడ్డి ప్రయత్నం చేసి ఐక్యత సాధించారు. 27వ వార్డు తెలుగుదేశం పార్టీ అభ్యర్థి చెరుకూరు పద్మావతమ్మ, రెబల్ అభ్యర్థి చెరుకూరు స్రవంతి తిరుపతి నాయుడు మధ్య ఐక్యతను పెంపొందించే దిశగా తారక్ నాథ్ రెడ్డి శ్రీరామాలయం వద్ద అందరు నాయకులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా నాయకులు చెరుకూరు శివప్రసాద్ నాయుడు, చెరుకూరు తిరుపతి నాయుడు సమక్షంలో బొమ్మిరెడ్డి తారకనాథ్ రెడ్డి ఇరువురూ కలిసి పనిచేసి కూటమి విజయానికి కృషి చేయాలని కోరారు.దీనిపై రెబల్ అభ్యర్థి చెరుకూరు స్రవంతి, తిరుపతి నాయుడు సానుకూలంగా స్పందిస్తూ, కూటమి ఐక్యతకు ప్రాధాన్యతనిస్తూ కలిసి పనిచేసి అభ్యర్థులను గెలిపిస్తామని తెలిపారు.
వ్యక్తిగత విభేదాలకు తావివ్వకుండా ఐక్యతతో ముందుకు సాగి కూటమి అభ్యర్థుల విజయానికి కృషి చేయాలనే లక్ష్యంతో జరిగిన తారక్ నాథ్ రెడ్డి ప్రయత్నం నెల్లూరు పాలెం 27వ వార్డులో రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది. అనంతరం బొమ్మిరెడ్డి తారక్ నాథ్ రెడ్డి  చెరుకూరు పద్మావతమ్మ ఇంటికి వెళ్లి ఆమెతో చర్చించారు. తారక్ నాథ్ రెడ్డి చొరవ, ప్రయత్నంతో విభేదాలకు తెర పడి ఐక్యతారాగం ఆలపించి సమైక్యతకు మార్గం సుగమమైంది.