టిడిపి, జనసేన నుంచి వైఎస్సార్‌సీపీలోకి 20 మంది యువకులు
పలమనేరు సూర్య మేజర్ న్యూస్ పెద్దపంజాణి గ్రామ పంచాయతీకి చెందిన టీడీపీ, జనసేన పార్టీలకు చెందిన 20 మంది యువకులు పలమనేరు వైఎస్సార్‌సీపీ కార్యాలయంలో మాజీ ఎమ్మెల్యే డా. ఎన్. వెంకటే గౌడ సమక్షంలో పార్టీలో చేరారు. వారికి పార్టీ కండువాలు కప్పి ఆహ్వానించిన వెంకటే గౌడ, యువత చేరికతో పార్టీ మరింత బలోపేతం అవుతుందని పేర్కొన్నారు.
రీపోటర్ : అనిల్ కుమార్ యాదవ్