telangana
నేల ఆరోగ్య పరిరక్షణతోనే సుస్థిర వ్యవసాయం.
సూర్య సారంగాపూర్;రైతులు భూసార పరిరక్షణకు ప్రాధాన్యతనిస్తూ శాస్త్రీయ పద్ధతుల్లో వ్యవసాయం చేయాలని జగిత్యాల జిల్లా డిప్యూటీ ప్రాజెక్ట్ డైరెక్టర్ జాన్ సుధాకర్ పేర్కొన్నారు. సారంగాపూర్ మండలంలో నిర్వహించిన 'ఖేత్ బచావ్ అభియాన్' కార్యక్రమంలో ఆయన పాల్గొని రైతులకు పలు కీలక అంశాలపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భూసార రక్షణ, ఎరువుల యాజమాన్యం: రైతులు భూసార పరీక్షలు చేయించుకుని, 'భూసార ఆరోగ్య కార్డుల, ఆధారంగానే ఎరువులను వాడాలన్నారు. యూరియా వంటి నత్రజని ఎరువులను మోతాదుకు మించి వాడకుండా, ప్రధాన పోషకాలను సమతుల్యంగా అందిస్తే సాగు ఖర్చులు తగ్గుతాయనీ రైతులకు సూచించారు.సేంద్రియ, పచ్చిరొట్ట ఎరువులు మరియు పంట అవశేషాలను నిర్వహించడం ద్వారా నేలలో సేంద్రియ కర్బనం పెరిగి భూసారం మెరుగవుతుందనీ అన్నారు.ఒకే పంటపై ఆధారపడకుండా, వాతావరణం మరియు నీటి లభ్యతకు తగినట్లు ప్రత్యామ్నాయ పంటలను సాగు చేయడం ద్వారా నష్టభయాన్ని తగ్గించుకోవచ్చారు.ప్రస్తుత ఎల్‌నినో ప్రభావ పరిస్థితులు, వర్షపాత అంచనాలు, జలాశయాల్లో నీటి నిల్వలు మరియు భూగర్భ జలాల లభ్యతను రైతులు బేరీజు వేసుకోవాలి. నీటి లభ్యతపై స్పష్టత లేకుండా అధిక నీటి అవసరం ఉండే పంటలను సాగు చేస్తే మధ్యలో నీటి కొరత ఏర్పడి దిగుబడులు దెబ్బతినే ప్రమాదం ఉంది. కాబట్టి పొలాలకు అందుబాటులో ఉన్న నీటి పరిమాణాన్ని బట్టి, వర్షాధార లేదా పరిమిత నీటి వనరులు ఉన్న ప్రాంతాల్లో తక్కువ నీటితో సాగు చేయగల పంటలకు ప్రాధాన్యత ఇవ్వాలన్నారు.ఈ కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారి ప్రదీప్ రెడ్డి , స్థానిక సర్పంచ్ చేకుట అరుణ శేఖర్ యాదవ్,,మాజీ ప్రజాప్రతినిధులు రాజేందర్ రెడ్డి, వ్యవసాయ విస్తరణ అధికారులు వెంకటేష్, పెద్ద సంఖ్యలో రైతులు పాల్గొన్నారు.