BREAKING
చిరుత సంచారంపై ఏఐ ఫోటోలు పెడితే కఠిన చర్యలు.. పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా రక్తదానం శిబిరం.. రీసర్వే భూములను పరిశీలించిన అదనపు కలెక్టర్ హాలీవుడ్ ఆఫర్లపై స్పందించిన రాజమౌళి.. ఆర్ఆర్ఆర్ తర్వాత ఆ వెసులుబాటు దక్కిందంటూ కీలక వ్యాఖ్యలు! త్రిష రోడ్ షో.. కోయంబత్తూరులో నటి ఓపెనింగ్ ఈవెంట్ పొలిటికల్ చర్చలకు దారితీసిందా? జంగారెడ్డిగూడెం అభివృద్ధికి కూటమి కృషి నేల ఆరోగ్య పరిరక్షణతోనే సుస్థిర వ్యవసాయం. ఛత్తీస్‌గఢ్‌ లో పెద్దపల్లి జిల్లా ఒగ్గుడోలు బృందం హిమ్మత్‌నగర్ గ్రామంలో జల సంరక్షణ పనులు ప్రారంభం ప్రభుత్వ డిగ్రీ కళాశాల అధ్యాపకురాలు టీవీఎస్ పద్మావతికి డాక్టరేట్ వెస్ట్ ఆస్ట్రేలియా కరిక్యులంతో అల్ఫోర్స్ ఇంటర్నేషనల్ స్కూల్ నైపుణ్య ఆధారిత విద్యకు ప్రాధాన్యత ఇవ్వాలి... అల్ఫోర్స్ విద్యాసంస్థల అధినేత డాక్టర్ వి. నరేందర్ రెడ్డి శ్రీ రామకృష్ణ ఇంటర్నేషనల్‌ సంస‍్థ తెలంగాణ అధ్యక్షుడిగా మణిదీప్‌ దైవ దర్శనానికి వెళ్లి తిరిగి వస్తూ... అనంత లోకాలకు -- రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి స్థానిక ఎన్నికల్లో కూటమి గెలుపే లక్ష్యం: ఎంపీ విజయ్ సమక్షంలో మంత్రి కొండపల్లి శ్రీనివాస్ కీలక చర్చలు ట్రేస్ ఇండియా సంస్థ ప్రతినిధి బృందం పాఠశాల సందర్శన --వ్యవస్థాపకులు దిడ్ల అంజిలో, స్విట్జర్లాండ్ దేశం నుండి వచ్చిన టుగెదర్ ఇండియా ప్రెసిడెంట్ మిస్టర్ సిగ్వి, వైస్ ప్రెసిడెంట్ మిస్టర్ మ్యాన్యుల్

భీమవరంలో భారీ దొంగతనాల కేసు 24 గంటల్లో ఛేదన శ్రీనిధి అపార్ట్‌మెంట్‌లో వరుస చోరీలు.. నిందితుడి అరెస్ట్ రూ.1.08 కోట్ల విలువైన బంగారం, వెండి, నగదు స్వాధీనం

Select Suryaa Now
భీమవరంలో భారీ దొంగతనాల కేసు 24 గంటల్లో ఛేదన  శ్రీనిధి అపార్ట్‌మెంట్‌లో వరుస చోరీలు.. నిందితుడి అరెస్ట్  రూ.1.08 కోట్ల విలువైన బంగారం, వెండి, నగదు స్వాధీనం

భీమవరం, సూర్య న్యూస్: భీమవరం పట్టణంలోని నరసయ్య అగ్రహారంలో ఉన్న శ్రీనిధి గ్రాండ్ అపార్ట్‌మెంట్‌లో జరిగిన వరుస దొంగతనాల కేసును భీమవరం వన్‌టౌన్ పోలీసులు కేవలం 24 గంటల వ్యవధిలో ఛేదించారు. ఈ కేసులో నిందితుడిని అరెస్టు చేసి, అతని వద్ద నుంచి సుమారు రూ.1,08,80,455 విలువైన బంగారం, వెండి ఆభరణాలు, నగదును స్వాధీనం చేసుకున్నారు. ఈ వివరాలను జిల్లా అదనపు ఎస్పీ డి. విశ్వనాథ్ శనివారం భీమవరం వన్‌టౌన్ పోలీస్ స్టేషన్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వెల్లడించారు.ఒకే అపార్ట్‌మెంట్‌లో ఏడు కేసులుపోలీసుల వివరాల ప్రకారం.. శ్రీనిధి గ్రాండ్ అపార్ట్‌మెంట్‌లో నివసించే శీలమంతుల కనక మహాలక్ష్మి ఫిర్యాదు మేరకు అక్టోబర్ 22న భీమవరం వన్‌టౌన్ పోలీస్ స్టేషన్‌లో క్రైమ్ నంబర్ 232/2026 కింద కేసు నమోదు చేశారు. అపార్ట్‌మెంట్‌లోని వివిధ ఫ్లాట్లను లక్ష్యంగా చేసుకుని దొంగతనాలకు పాల్పడిన ఘటనలకు సంబంధించి మొత్తం ఏడు కేసులు నమోదయ్యాయి.ఇళ్లలో నివాసితులు లేని సమయాన్ని ఆసరాగా చేసుకున్న నిందితుడు తలుపులు, బీరువాల తాళాలు పగులగొట్టి లోపల ఉన్న బంగారం, వెండి ఆభరణాలు, నగదును అపహరించినట్లు పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది.సీసీ కెమెరాల ఆధారంగా నిందితుడి గుర్తింపుజిల్లా ఎస్పీ అద్నాన్ నయీమ్ అస్మి ఆదేశాల మేరకు, అదనపు ఎస్పీ డి. విశ్వనాథ్, సబ్ డివిజనల్ పోలీస్ ఆఫీసర్ రఘువీర్ విష్ణు పర్యవేక్షణలో దర్యాప్తు వేగవంతం చేశారు. వన్‌టౌన్ సీఐ రమేష్ నేతృత్వంలోని క్రైమ్ టీమ్ ఘటనా స్థలాలను పరిశీలించి, సీసీ కెమెరాల ఫుటేజీలను విశ్లేషించింది. పోలీసులకు అందిన విశ్వసనీయ సమాచారం ఆధారంగా అక్టోబర్ 23న సాయంత్రం 5 గంటల సమయంలో భీమవరం రైల్వే జంక్షన్ స్టేషన్ పరిధిలో నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.రూ.1.08 కోట్ల చోరీ సొత్తు స్వాధీనంనిందితుడిగా గుర్తించిన మహ్మద్ బాషా (40) నుంచి సుమారు 800 గ్రాముల బంగారం, 2.5 కిలోల వెండి ఆభరణాలతో పాటు నగదును స్వాధీనం చేసుకున్నట్లు అదనపు ఎస్పీ తెలిపారు. స్వాధీనం చేసుకున్న మొత్తం సొత్తు విలువ రూ.1,08,80,455గా పేర్కొన్నారు.పోలీసు బృందానికి అభినందనలుఈ కేసును వేగంగా ఛేదించి, చోరీ సొత్తును స్వాధీనం చేసుకున్న వన్‌టౌన్ సీఐ రమేష్, ఎస్‌ఐలు కే. చంద్రశేఖర్, కే. శ్రీనివాస్‌తో పాటు క్రైమ్ పార్టీ సిబ్బందిని అదనపు ఎస్పీ ప్రత్యేకంగా అభినందించారు. ఈ ఆపరేషన్‌లో హెడ్ కానిస్టేబుల్ యెహోషువా, కానిస్టేబుళ్లు రామకృష్ణ, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.ఒకే అపార్ట్‌మెంట్‌లో వరుసగా ఏడు దొంగతనాల కేసులు నమోదవడం, వాటిని పోలీసులు తక్కువ వ్యవధిలో ఛేదించి భారీ మొత్తంలో సొత్తును స్వాధీనం చేసుకోవడం స్థానికంగా చర్చనీయాంశమైంది.