telangana
రీసర్వే భూములను పరిశీలించిన అదనపు కలెక్టర్
సూర్య,మాక్లూర్ ;;మాక్లూర్ మండలం ముల్లంగి (బి) గ్రామంలో రీసర్వే భూములను అదనపు కలెక్టర్ (రెవెన్యూ) బి. రాజాగౌడ్ పరిశీలించారు. ఈ సందర్భంగా భూముల రీసర్వే ప్రక్రియను క్షేత్రస్థాయిలో పరిశీలించి, సంబంధిత వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో తహసీల్దార్ ఆకుల శేఖర్,మండల సర్వేయర్ కిషన్ నాయక్,రెవెన్యూ ఇన్స్పెక్టర్ శశాంక్,సర్పంచ్ ధర్మపతి,రైతులు,తదితరులు పాల్గొన్నారు.