అమరవీరుల త్యాగాలు మరువలేనివి
జనగామ , మేజర్ న్యూస్ , అమరవీరుల వారోత్సవాల సందర్భంగా జనగామ పట్టణంలో శనివారం కళాబృందం ద్వారా అవగాహన కార్యక్రమం నిర్వహించారు.
వరంగల్ పోలీస్ కమిషనర్ ఎన్. శ్వేత ఐపీఎస్ మరియు జనగామ డీసీపీ రాజా మహేంద్ర నాయక్ ఐపీఎస్ ఆదేశాల మేరకు కార్యక్రమాన్ని నిర్వహించారు.
విధి నిర్వహణలో ప్రాణాలు అర్పించిన పోలీసు అమరవీరుల త్యాగాలను, సేవలను స్మరించుకుంటూ కళాకారులు నాటికలు, పాటల రూపంలో వారి ధైర్యసాహసాలు, అంకితభావం, త్యాగాలను వివరించారు. సమాజానికి వారు అందించిన అమూల్యమైన సేవల గురించి ప్రజలకు అవగాహన కల్పించారు.
రిపోర్టర్; నవీనా చారి, జనగామ, జనగామ జిల్లా