BREAKING
బెంగళూరు ట్రాఫిక్‌తో విసిగిపోయారా? రూ.3 లక్షల కార్ హ్యాక్‌తో నెటిజన్లను ఆశ్చర్యపరిచిన టెక్కీ ముంబై రెస్టారెంట్లపై ఎఫ్‌డీఏ కొరడా: ఒట్టోమన్ కేఫ్, భారత్ క్యాంటీన్ సహా 7 హోటళ్ల లైసెన్సులు రద్దు.. ఎఫ్‌1 యునైటెడ్ స్టేట్స్ గ్రాండ్ ప్రిక్స్ క్వాలిఫైయింగ్ లైవ్ స్ట్రీమింగ్: నవంబర్ 1న రాహుల్ గాంధీ ర్యాలీతో ఢిల్లీ మార్కెట్లకు రూ.10,000 కోట్ల దెబ్బ: కేరళ లోక్ భవన్ కిచెన్‌లో మాంసాహారంపై నిషేధం: బాధ్యతలు చేపట్టిన తొలిరోజే గవర్నర్ ఓం ప్రకాష్ మాథుర్ కీలక ఆదేశాలు.. ప్రోస్టేట్ క్యాన్సర్ కణతులను కరిగించే సరికొత్త ఔషధం: జాన్సన్ అండ్ జాన్సన్ 'JNJ-6143' ట్రయల్స్‌లో కీలక పురోగతి.. సౌదీ అరేబియాలో చిక్కుకున్న భారతీయ ఉమ్రా యాత్రికులకు కేంద్రం అండ: సంచాలన స్కూల్ ఆఫ్ డాన్స్ ఆధ్వర్యంలో మాస్టర్స్ ఎగ్జామినేషన్ కార్తీక్ సుబ్బరాజ్ 'డోరతీ' అరుదైన చిత్రం.. ట్రాన్స్‌జెండర్ల జీవితాలకు హ్యాపీ ఎండింగ్ ఇచ్చిన డైరెక్టర్! ట్యాంకర్ల ద్వారా నీటి వృథాను అరికట్టేందుకు కఠిన చర్యలు : నవంబర్ 1 నుంచి నిబంధనల ఉల్లంఘనకు రూ.5 వేల జరిమానా నటనకు బ్రేక్ ఇవ్వడంపై ఎలాంటి రిగ్రెట్ లేదు.. అమృత పూరి ఆసక్తికర వ్యాఖ్యలు! చారిత్రక కట్టడాల పరిరక్షణ, అభివృద్ధి పనులను వేగవంతం చేయాలి చార్మినార్ పరిసరాల్లో క్యూ క్యు ఎస్ యు డి ఎ అడ్మినిస్ట్రేటర్ పి. గౌతమి ఐఏఎస్ తనిఖీ నీటిని పొదుపుగా వాడాలి : నీటి సంరక్షణకు ‘మేము సైతం’ అంటూ ప్రతిజ్ఞ. సూమో డిడి మూవీ రివ్యూ.. భారత్ తొలి మహిళా సూమో రెజ్లర్ జీవితాధారంగా వచ్చిన సినిమా ఎలా ఉందంటే! శ్రీకృష్ణ సదర్ సమ్మేళనం–2026 .

కూచిపూడి గ్రేడ్ పరీక్షలను నిర్వహించిన అఖిల భారత కళా సాధన పరిషత్

Select Suryaa Now
కూచిపూడి గ్రేడ్ పరీక్షలను నిర్వహించిన అఖిల భారత కళా సాధన పరిషత్

రవీంద్ర భారతి, మేజర్ న్యూస్  : రుద్ర కళాక్షేత్రం కల్చరల్ సొసైటీ ఆధ్వర్యంలో అఖిల భారత కళా సాధన పరిషత్ నిర్వహిస్తున్న కూచిపూడి నాట్య విభాగం 2026 ద్వైవార్షిక గ్రేడ్ పరీక్షలు హైదరాబాద్ లోని స్థానిక శ్రీ అర్ధ నారీశ్వర కూచిపూడి డాన్స్ అకాడమీ లో శనివారం విజయవంతంగా నిర్వహించబడ్డాయి. వివిధ స్థాయిలలో జరిగిన ఈ పరీక్షలకు నాట్యాచారిమణులు రాణి ప్రియ, ఎస్. భార్గవి, టి. సాయి ప్రియ శిష్యులు సుమారు 120 మంది హాజరై తమ నాట్య ప్రతిభను ప్రదర్శించారు. ఈ సందర్భంగా రుద్ర కళాక్షేత్రం వ్యవస్థాపకులు మాచిరాజు రాజేష్ మాట్లాడుతూ.. కూచిపూడి వంటి శాస్త్రీయ కళలను చిన్ననాటి నుంచే క్రమబద్ధమైన శిక్షణతో అభ్యసించడం ఎంతో ముఖ్యమని అన్నారు. పరీక్షలు విద్యార్థుల్లో కేవలం మార్కులు లేదా గ్రేడ్‌ల కోసం కాకుండా, క్రమశిక్షణ, సాధన, నాట్య పరిజ్ఞానంతో వేదికపై ప్రదర్శించే సామర్థ్యాన్ని పెంపొందించేందుకు ఒక ముఖ్యమైన అవకాశంగా ఉపయోగపడతాయని తెలిపారు.
“కళను నేర్చుకోవడం ఒక నిరంతర సాధన. విద్యార్థులు గురువుల వద్ద నేర్చుకున్న అంశాలను క్రమం తప్పకుండా సాధన చేస్తూ..పరీక్షల ద్వారా తమ అభ్యాసాన్ని ఒక దశ నుంచి మరో దశకు తీసుకెళ్లాలన్నారు . కూచిపూడి కళను భవిష్యత్ తరాలకు అందించడంలో ఇటువంటి క్రమబద్ధమైన పరీక్షా విధానం ఎంతో ఉపయోగపడుతుందిని రాజేష్ తెలిపారు. ఈ పరీక్షల నిర్వహణలో శ్రీఅర్ధ నారీశ్వర కూచిపూడి డాన్స్ అకాడమీ వ్యవస్థాపకులు గెల్లంకి రాణి ప్రియ , సిబ్బందితో పాటు స్థానిక గురువులు సమన్వయంతో వ్యవహరించారు. రుద్ర కళాక్షేత్రం కల్చరల్ సొసైటీ ఆధ్వర్యంలో అఖిల భారత కళా సాధన పరిషత్ కూచిపూడి గ్రేడ్ పరీక్షలను ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలలో క్రమం తప్పకుండా నిర్వహిస్తూ.. విద్యార్థులకు శాస్త్రీయ నాట్య విద్యలో ప్రామాణికమైన అభ్యాస వాతావరణాన్ని అందించేందుకు కృషి చేస్తోందని నిర్వాహకులు తెలిపారు.