వేడుకగా శ్రీవారి ఎదుర్కోలు ఉత్సవం
ద్వారకాతిరుమల మేజర్ న్యూస్: ద్వారకాతిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారి అశ్వయుజ మాస తిరు కళ్యాణ మహోత్సవములు సందర్భంగా శనివారం స్వామివారికి ఎదుర్కోలు ఉత్సవం వైభవంగా జరిగింది.ముందుగా స్వామి అమ్మవార్లను ఆలయం నుండి వెండి శేష వాహనంపై నిత్య కళ్యాణమండపం వద్దకు తెచ్చారు. అక్కడ విశేషంగా అలంకరించిన వేదికపై కళ్యాణమూర్తులను ఉంచి ప్రత్యేక అలంకరణలు, పూజలు చేశారు. ఈ సందర్భంగా అర్చకులు పండితులు రెండు జట్లుగా విడిపోయి స్వామివారి, అమ్మవార్ల గుణగణాలను, కీర్తించారు. ఉదయం హనుమత్ వాహనంపై, రాత్రి వెండి శేష వాహనంపై, గ్రామోత్సవం వైభవంగా జరిగింది.