BREAKING
అనివార్య కారణాలతో భారత్ పర్యటన రద్దు చేసుకున్న ఇరాన్ స్పీకర్ గలీబాఫ్: బెంగళూరు ట్రాఫిక్‌తో విసిగిపోయారా? రూ.3 లక్షల కార్ హ్యాక్‌తో నెటిజన్లను ఆశ్చర్యపరిచిన టెక్కీ ముంబై రెస్టారెంట్లపై ఎఫ్‌డీఏ కొరడా: ఒట్టోమన్ కేఫ్, భారత్ క్యాంటీన్ సహా 7 హోటళ్ల లైసెన్సులు రద్దు.. ఎఫ్‌1 యునైటెడ్ స్టేట్స్ గ్రాండ్ ప్రిక్స్ క్వాలిఫైయింగ్ లైవ్ స్ట్రీమింగ్: నవంబర్ 1న రాహుల్ గాంధీ ర్యాలీతో ఢిల్లీ మార్కెట్లకు రూ.10,000 కోట్ల దెబ్బ: కేరళ లోక్ భవన్ కిచెన్‌లో మాంసాహారంపై నిషేధం: బాధ్యతలు చేపట్టిన తొలిరోజే గవర్నర్ ఓం ప్రకాష్ మాథుర్ కీలక ఆదేశాలు.. ప్రోస్టేట్ క్యాన్సర్ కణతులను కరిగించే సరికొత్త ఔషధం: జాన్సన్ అండ్ జాన్సన్ 'JNJ-6143' ట్రయల్స్‌లో కీలక పురోగతి.. సౌదీ అరేబియాలో చిక్కుకున్న భారతీయ ఉమ్రా యాత్రికులకు కేంద్రం అండ: సంచాలన స్కూల్ ఆఫ్ డాన్స్ ఆధ్వర్యంలో మాస్టర్స్ ఎగ్జామినేషన్ కార్తీక్ సుబ్బరాజ్ 'డోరతీ' అరుదైన చిత్రం.. ట్రాన్స్‌జెండర్ల జీవితాలకు హ్యాపీ ఎండింగ్ ఇచ్చిన డైరెక్టర్! ట్యాంకర్ల ద్వారా నీటి వృథాను అరికట్టేందుకు కఠిన చర్యలు : నవంబర్ 1 నుంచి నిబంధనల ఉల్లంఘనకు రూ.5 వేల జరిమానా నటనకు బ్రేక్ ఇవ్వడంపై ఎలాంటి రిగ్రెట్ లేదు.. అమృత పూరి ఆసక్తికర వ్యాఖ్యలు! చారిత్రక కట్టడాల పరిరక్షణ, అభివృద్ధి పనులను వేగవంతం చేయాలి చార్మినార్ పరిసరాల్లో క్యూ క్యు ఎస్ యు డి ఎ అడ్మినిస్ట్రేటర్ పి. గౌతమి ఐఏఎస్ తనిఖీ నీటిని పొదుపుగా వాడాలి : నీటి సంరక్షణకు ‘మేము సైతం’ అంటూ ప్రతిజ్ఞ. సూమో డిడి మూవీ రివ్యూ.. భారత్ తొలి మహిళా సూమో రెజ్లర్ జీవితాధారంగా వచ్చిన సినిమా ఎలా ఉందంటే!

ఐక్యరాజ్యసమితి వేడుకల్లో రోటర్‌డామ్ స్కూల్‌ విద్యార్థుల సందడి

Select Suryaa Now
ఐక్యరాజ్యసమితి వేడుకల్లో రోటర్‌డామ్ స్కూల్‌ విద్యార్థుల సందడి
ఘట్‌కేసర్, మేజర్ న్యూస్(అక్టోబర్, 24): ప్రపంచ శాంతి, అంతర్జాతీయ ఐక్యత, సాంస్కృతిక సమైక్యతే లక్ష్యంగా హైదరాబాద్‌లో నిర్వహించిన ఐక్యరాజ్యసమితి దినోత్సవ వేడుకల్లో రోటర్‌డామ్ ఇంటర్నేషనల్ స్కూల్‌ విద్యార్థులు పాల్గొన్నారు. పాఠశాల ప్రిన్సిపల్‌ కె. రూపా రెడ్డి విద్యార్థులతో కలిసి ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. సంజీవయ్య పార్క్‌, నెక్లెస్‌ రోడ్‌ వద్ద ఇంటర్నేషనల్ కమిషన్ ఆఫ్ కల్చర్ అండ్ డిప్లొమాటిక్ రిలేషన్స్‌ (ఐసీసీడీఆర్‌), ఫిల్వెక్స్ హాబీ సొసైటీ, ఇండియన్ వెక్సిలాలజికల్ అసోసియేషన్‌ సంయుక్తంగా ఈ వేడుకలను నిర్వహించాయి. తెలంగాణ ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేష్‌ రంజన్‌ ముఖ్య అతిథిగా పాల్గొని భారత జాతీయ పతాకంతో పాటు ఐక్యరాజ్యసమితి పతాకాన్ని ఆవిష్కరించారు. వివిధ దేశాల జాతీయ పతాకాలను చేతబూని స్కౌట్స్‌ అండ్‌ గైడ్స్‌ సభ్యులు నిర్వహించిన ఆరు కిలోమీటర్ల మార్చ్‌పాస్ట్‌ వేడుకల్లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. సంజీవయ్య పార్క్‌లోని భారీ జాతీయ పతాకం నుంచి నెక్లెస్‌ రోడ్‌ వరకు సాగిన ఈ ప్రదర్శన అంతర్జాతీయ స్నేహసంబంధాలు, ఐక్యత సందేశాన్ని చాటిచెప్పింది. ప్రపంచ శాంతి, సమానత్వం, పర్యావరణ పరిరక్షణ, ఐక్యరాజ్యసమితి సుస్థిర అభివృద్ధి లక్ష్యాలపై జరిగిన ప్రసంగాలు విద్యార్థుల్లో అంతర్జాతీయ అంశాలపై అవగాహన పెంపొందించేలా సాగాయి. విద్యార్థుల్లో ప్రపంచ పౌరసత్వ భావనను పెంపొందించడం, విభిన్న సంస్కృతుల పట్ల గౌరవాన్ని అలవర్చడం లక్ష్యంగా పాఠశాల ప్రతినిధులు ఈ కార్యక్రమంలో భాగస్వాములయ్యారు. అనంతరం వివిధ రంగాల్లో సేవలందించిన ప్రముఖులకు సన్మానాలు, పురస్కారాలు అందజేశారు. ఫిల్వెక్స్ హాబీ సొసైటీ వ్యవస్థాపకుడు సంజీవ రావు కంభంపాటి కార్యక్రమ నిర్వహణలో కీలక పాత్ర పోషించారు.