telangana
చిరుత సంచారంపై ఏఐ ఫోటోలు పెడితే కఠిన చర్యలు..
సూర్య, నాగిరెడ్డి పేట్, గ్రామాలలో చిరుత పులి సంచరిస్తున్నట్లు ఏ ఐ టెక్నాలజీతో క్రియేట్ చేసిన ఫోటోలు సోషల్ మీడియాలో పెట్టి ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తే వారిపై కఠిన చర్యలు తప్పవని నాగిరెడ్డిపేట ఆటవీ శాఖ అధికారి వాసుదేవ్ హెచ్చరించారు. మండలంలోని మాసానిపల్లి గ్రామ శివారులో చిరుత పులి సంచరించినట్లు శనివారం సమాచారం రావడంతో ఎఫ్ ఆర్ వో వాసుదేవ్, అటవీ శాఖ సిబ్బందితో కలిసి చిరుతపులి సంచరించిన ప్రాంతంతో పాటు, చుట్టుప్రక్కల ప్రాంతాలలో తనిఖీలు చేసినట్లు తెలిపారు. గ్రామ పరిసర ప్రాంతాల్లో క్షుణ్ణంగా తనిఖీ చేసిన అనంతరం ఎలాంటి ఆనవాళ్లు లభ్యం కాలేవని ఎఫ్ ఆర్ వో వాసుదేవ్ తెలిపారు. గ్రామానికి చెందిన ఒక ట్రాక్టర్ డ్రైవర్ ఏఐ టెక్నాలజీతో చిరుత పులి ఫోటోలు క్రియేట్ చేసి మాసానిపల్లి వాట్సప్ సోషల్ మీడియా గ్రూపులో పోస్టులు పెడుతూ గ్రామస్తులను భయం బ్రాంతులకు గురి చేయడం జరిగిందని, ఈ విషయంపై ట్రాక్టర్ డ్రైవర్ ను విచారించి ట్రాక్టర్ డ్రైవర్ ఫోను మొత్తం పూర్తిగా తనిఖీ చేయగా అది ఏఐ చిత్రంగా గుర్తించడం జరిగిందని ఎఫ్ ఆర్ వో వాసుదేవ్ తెలిపారు. ఈ విధంగా ఏఐ టెక్నాలజీతో ఫోటోలు క్రియేట్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేసి వైరల్ చేసి ప్రజలను భయ బ్రాంతులకు గురిచేసిన వారిపై చట్టరీత్యా కేసు నమోదు చేసి రిమాండ్ కు పంపించడం జరుగుతుందని హెచ్చరించారు.