BREAKING
ఓటీటీలోకి వచ్చేసిన కన్నడ మిస్టరీ థ్రిల్లర్.. తెలుగులోనూ స్ట్రీమింగ్! దుందిగల్ అసైన్డ్ భూముల ల్యాండ్ పూలింగ్‌పై స్పష్టత ఇవ్వాలి.. కూచిపూడి గ్రేడ్ పరీక్షలను నిర్వహించిన అఖిల భారత కళా సాధన పరిషత్ సోమాజిగూడ హెడ్ క్వార్టర్స్ బార్‌లో రివాల్వర్‌తో హల్‌చల్‌.. కస్టమర్లు, బౌన్సర్లకు బెదిరింపులు జర్నలిస్టులకు ఇళ్ల స్థలాల కల సాకారం చేస్తాం రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్, సమాచార పౌరసంబంధాల శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పట్టభద్రుల ఓటరు నమోదు వేగవంతం చేయాలి: రవికుమార్ యాదవ్,శ్రీనివాస్ రెడ్డి ఐక్యరాజ్యసమితి ప్రాధాన్యతను తెలుసుకోవాలి: డాక్టర్ వెంకటరమణ నేరస్థుడిపై మరోసారి పీడీ యాక్ట్‌.. చర్లపల్లి జైలుకు తరలింపు మాజీ ఎంపీ రంజిత్ రెడ్డికి ఎమ్మెల్యే గాంధీ,మాజీ కార్పొరేటర్లు దసరా శుభాకాంక్షలు భూ రికార్డులపై రైతులకు అవగాహన అవసరం : తహసీల్దార్‌ చంద్రశేఖర్‌ మాదాపూర్‌ సున్నం చెరువులో అక్రమ నీటి దందాపై హైడ్రా ఉక్కుపాదం....అక్రమ బోర్లను ద్వంసం చేసిన హైడ్రా అమెరి కిడ్స్‌ పాఠశాలలో ఘనంగా బతుకమ్మ సంబరాలు. లలిత కపిలవాయి ‘కళాప్రయాణం’ చిత్రకళా ప్రదర్శన - హైదరాబాద్ స్టేట్ ఆర్ట్ గ్యాలరీలో ప్రారంభం రోడ్డు ప్రమాదంలో వ్యక్తి దుర్మరణం కుక్క అడ్డురావడంతో స్కూటీపై నుంచి పడి మృతి ప్రతి నీటి బొట్టు ను ఒడిసి పట్టాలి -వరంగల్ జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద

అభివృద్ధిని గెలిపించండి

Select Suryaa Now
అభివృద్ధిని గెలిపించండి

నేటి దినపత్రిక సూర్య బ్యూరో రాజమహేంద్రవరంరామచంద్రపురం పట్టణాన్ని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్‌ ఆధ్వర్యంలో అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్తున్నామని టీడీపీ సీనియర్‌ నాయకురాలు, 22వ వార్డు టీడీపీ అభ్యర్థి జాస్తి విజయలక్ష్మి అన్నారు. పట్టణంలో మరిన్ని అభివృద్ధి పనులు, మౌలిక సదుపాయాల కల్పన కోసం కూటమి అభ్యర్థులకు మద్దతు తెలిపి గెలిపించాలని ఆమె పట్టణ ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

మున్సిపాలిటీ పరిధిలోని 22వ వార్డులో ఆమె పలు ప్రాంతాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఇంటింటికీ వెళ్లి ప్రజలను కలుసుకుని, వార్డు అభివృద్ధికి తనకు మద్దతు ఇవ్వాలని అభ్యర్థించారు.

ఈ సందర్భంగా విజయలక్ష్మి మాట్లాడుతూ, గత రెండేళ్లలో మంత్రి వాసంశెట్టి సుభాష్‌ ఆధ్వర్యంలో టీడీపీ ప్రభుత్వం పట్టణ అభివృద్ధికి పలు చర్యలు చేపట్టిందని పేర్కొన్నారు. రానున్న రోజుల్లో వార్డులో మరిన్ని మౌలిక సదుపాయాలు కల్పించేందుకు కృషి చేస్తానని తెలిపారు. ప్రజల సమస్యల పరిష్కారానికి, వార్డు అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని పేర్కొంటూ, తనను ఆదరించి గెలిపించాలని కోరారు.

ఈ ఎన్నికల ప్రచారంలో పార్టీ నాయకులు రెడ్డి సురేష్, చెలంకూరి కల్యాణ్, ముత్యాల శ్రీహరి, కొమరిన శ్రీనివాస్, పసళ్ల వీరన్న చౌదరి, పసల వీర్రాజు చౌదరి, కొప్పెల సత్యనారాయణ, అడపా సతీరాజు తదితరులు పాల్గొన్నారు.