BREAKING
ఓటీటీలోకి వచ్చేసిన కన్నడ మిస్టరీ థ్రిల్లర్.. తెలుగులోనూ స్ట్రీమింగ్! దుందిగల్ అసైన్డ్ భూముల ల్యాండ్ పూలింగ్‌పై స్పష్టత ఇవ్వాలి.. కూచిపూడి గ్రేడ్ పరీక్షలను నిర్వహించిన అఖిల భారత కళా సాధన పరిషత్ సోమాజిగూడ హెడ్ క్వార్టర్స్ బార్‌లో రివాల్వర్‌తో హల్‌చల్‌.. కస్టమర్లు, బౌన్సర్లకు బెదిరింపులు జర్నలిస్టులకు ఇళ్ల స్థలాల కల సాకారం చేస్తాం రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్, సమాచార పౌరసంబంధాల శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పట్టభద్రుల ఓటరు నమోదు వేగవంతం చేయాలి: రవికుమార్ యాదవ్,శ్రీనివాస్ రెడ్డి ఐక్యరాజ్యసమితి ప్రాధాన్యతను తెలుసుకోవాలి: డాక్టర్ వెంకటరమణ నేరస్థుడిపై మరోసారి పీడీ యాక్ట్‌.. చర్లపల్లి జైలుకు తరలింపు మాజీ ఎంపీ రంజిత్ రెడ్డికి ఎమ్మెల్యే గాంధీ,మాజీ కార్పొరేటర్లు దసరా శుభాకాంక్షలు భూ రికార్డులపై రైతులకు అవగాహన అవసరం : తహసీల్దార్‌ చంద్రశేఖర్‌ మాదాపూర్‌ సున్నం చెరువులో అక్రమ నీటి దందాపై హైడ్రా ఉక్కుపాదం....అక్రమ బోర్లను ద్వంసం చేసిన హైడ్రా అమెరి కిడ్స్‌ పాఠశాలలో ఘనంగా బతుకమ్మ సంబరాలు. లలిత కపిలవాయి ‘కళాప్రయాణం’ చిత్రకళా ప్రదర్శన - హైదరాబాద్ స్టేట్ ఆర్ట్ గ్యాలరీలో ప్రారంభం రోడ్డు ప్రమాదంలో వ్యక్తి దుర్మరణం కుక్క అడ్డురావడంతో స్కూటీపై నుంచి పడి మృతి ప్రతి నీటి బొట్టు ను ఒడిసి పట్టాలి -వరంగల్ జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద

టిడిపి ఇంటింటా ప్రసారంలో సానా సతీష్

Select Suryaa Now
టిడిపి ఇంటింటా ప్రసారంలో సానా సతీష్

నేటి దినపత్రిక సూర్య న్యూరో రాజమహేంద్రవరంమున్సిపాలిటీ జనసేన పార్టీ చైర్మన్ అభ్యర్థి నల్లా శ్రీధర్ ఎన్నికల ప్రచారం పట్టణంలో జోరుగా కొనసాగుతోంది. శనివారం 20, 21వ వార్డుల్లో నిర్వహించిన ఇంటింటి ప్రచార కార్యక్రమానికి పలువురు ప్రజాప్రతినిధులు, కూటమి నాయకులు, కార్యకర్తలు హాజరై శ్రీధర్‌కు మద్దతుగా ప్రచారం నిర్వహించారు. ఆయా వార్డుల్లో ఇంటింటికీ వెళ్లి ఓటర్లను కలుస్తూ కూటమి అభ్యర్థులను గెలిపించాలని కోరారు.

ఈ ప్రచార కార్యక్రమంలో రాజ్యసభ సభ్యుడు సానా సతీష్, ఎమ్మెల్యే అయితాబత్తుల ఆనందరావు, రవణం స్వామినాయుడు, అల్లాడ స్వామినాయుడు, మార్కెట్ చైర్మన్ అధికారి విజయలక్ష్మి, చిక్కాల గణేష్, గంధంపల్లంరాజు, కంచిపల్లి అబ్బులు కౌన్సిలర్ అభ్యర్థులు సాయిచంద్ర ప్రవీణ్, గంటీ వి.ఎల్. నరసింహమూర్తి,  తదితరులు పాల్గొన్నారు. కూటమి నాయకులు, కార్యకర్తలు, వార్డుల ప్రజలు ప్రచారంలో పాల్గొని అభ్యర్థులకు మద్దతు తెలిపారు.

నల్లా శ్రీధర్‌తో పాటు కూటమి నాయకులు వివిధ వార్డుల్లో పోటీ చేస్తున్న అభ్యర్థులకు మద్దతుగా ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు ప్రముఖులు మాట్లాడుతూ నల్లా శ్రీధర్ పట్టణ అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారిస్తారని, మున్సిపాలిటీలోని వార్డుల్లో నెలకొన్న సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తారని పేర్కొన్నారు. అమలాపురం పట్టణాన్ని సుందరంగా తీర్చిదిద్దేందుకు ఆయన ముందుండి పనిచేస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు.సమస్యల పరిష్కారమే లక్ష్యం:నల్లా శ్రీధర్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఏడో వార్డులో పర్యటించిన నల్లా శ్రీధర్ మాట్లాడుతూ, గత ప్రభుత్వ హయాంలో మున్సిపాలిటీలోని పలు వార్డుల్లో అభివృద్ధి పనులు జరగలేదని విమర్శించారు. రహదారులు, డ్రైనేజీ వంటి సమస్యలు పరిష్కారం కాక ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు.

ఏడో వార్డులోనే తన ఓటు కూడా ఉందని పేర్కొన్న ఆయన, స్థానిక సమస్యలపై తనకు పూర్తి అవగాహన ఉందన్నారు. కూటమి అధికారంలోకి వచ్చిన వెంటనే మున్సిపాలిటీ పరిధిలోని అన్ని వార్డుల్లో సమస్యలను గుర్తించి, వాటి పరిష్కారానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు. ప్రజలకు అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించడమే తమ ప్రధాన లక్ష్యమని తెలిపారు.

ఈ కార్యక్రమంలో నల్లా చిట్టి, ఏడిది శ్రీను, మోకా వెంకట సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు.