BREAKING
జమ్మూలో పాకిస్తానీయుల అక్రమ నివాసం: 65 మందిపై క్రైమ్ బ్రాంచ్ ఛార్జ్‌షీట్! బ్రోకర్ ట్రేడింగ్ టెర్మినళ్ల దుర్వినియోగానికి అడ్డుకట్ట: త్వరలో కఠిన నిబంధనలు తేనున్న సెబీ.. ఛైర్మన్ తుహిన్ కాంత పాండే కీలక ప్రకటన! నేటి పంచాంగం 25 అక్టోబర్ 2026 నేటి రాశి ఫలాలు –25 అక్టోబర్ 2026 అనివార్య కారణాలతో భారత్ పర్యటన రద్దు చేసుకున్న ఇరాన్ స్పీకర్ గలీబాఫ్: బెంగళూరు ట్రాఫిక్‌తో విసిగిపోయారా? రూ.3 లక్షల కార్ హ్యాక్‌తో నెటిజన్లను ఆశ్చర్యపరిచిన టెక్కీ ముంబై రెస్టారెంట్లపై ఎఫ్‌డీఏ కొరడా: ఒట్టోమన్ కేఫ్, భారత్ క్యాంటీన్ సహా 7 హోటళ్ల లైసెన్సులు రద్దు.. ఎఫ్‌1 యునైటెడ్ స్టేట్స్ గ్రాండ్ ప్రిక్స్ క్వాలిఫైయింగ్ లైవ్ స్ట్రీమింగ్: నవంబర్ 1న రాహుల్ గాంధీ ర్యాలీతో ఢిల్లీ మార్కెట్లకు రూ.10,000 కోట్ల దెబ్బ: కేరళ లోక్ భవన్ కిచెన్‌లో మాంసాహారంపై నిషేధం: బాధ్యతలు చేపట్టిన తొలిరోజే గవర్నర్ ఓం ప్రకాష్ మాథుర్ కీలక ఆదేశాలు.. ప్రోస్టేట్ క్యాన్సర్ కణతులను కరిగించే సరికొత్త ఔషధం: జాన్సన్ అండ్ జాన్సన్ 'JNJ-6143' ట్రయల్స్‌లో కీలక పురోగతి.. సౌదీ అరేబియాలో చిక్కుకున్న భారతీయ ఉమ్రా యాత్రికులకు కేంద్రం అండ: సంచాలన స్కూల్ ఆఫ్ డాన్స్ ఆధ్వర్యంలో మాస్టర్స్ ఎగ్జామినేషన్ కార్తీక్ సుబ్బరాజ్ 'డోరతీ' అరుదైన చిత్రం.. ట్రాన్స్‌జెండర్ల జీవితాలకు హ్యాపీ ఎండింగ్ ఇచ్చిన డైరెక్టర్! ట్యాంకర్ల ద్వారా నీటి వృథాను అరికట్టేందుకు కఠిన చర్యలు : నవంబర్ 1 నుంచి నిబంధనల ఉల్లంఘనకు రూ.5 వేల జరిమానా

‎వచ్చే నెలలోనే చింతలపూడి పనులు ప్రారంభం.. ఎంపీ పుట్టా మహేష్ కుమార్

Select Suryaa Now
‎వచ్చే నెలలోనే చింతలపూడి పనులు ప్రారంభం.. ఎంపీ పుట్టా మహేష్ కుమార్

ఏలూరు,/ చింతలపూడి సూర్య న్యూస్ ఎత్తిపోతల పథకానికి అడ్డంకులు తొలగిపోయాయని, ప్రాజెక్టు పనులు వచ్చే నెలలోనే మొదలవుతాయనీ ఎంపీ పుట్టా మహేష్ కుమార్ స్పష్టం చేశారు. ఈమేరకు శనివారం  మీడియోకు ఎంపీ ప్రకటన విడుదల చేశారు. సగం పైగా పూర్తయ్యి, గత ప్రభుత్వం నిర్లక్ష్యం వల్ల ఆగిపోయిన చింతలపూడి ప్రాజెక్టును పూర్తి చేసేందుకు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అన్ని అడ్డంకులను తొలగించుకుంటూ ముందుకు వెళుతున్నామని చెప్పారు. ఇటీవలే కేంద్ర అటవీ పర్యావరణ శాఖ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయాన్ని ఎంపీ గుర్తు చేశారు. త్వరగా పనులు మొదలు పెట్టేందుకు ఏర్పాట్లు చేయాలని సీఎం చంద్రబాబు చెప్పారని, వచ్చే నెలలోనే (నవంబర్‌) పనులు మొదలు పెడతామని చెప్పిన ఎంపీ, చింతలపూడి ఎత్తిపోతల ప్రాజెక్టు పూర్తయితే, ఏలూరు జిల్లాలో దాదాపు లక్ష ఎకరాలకు కాలువల ద్వారా సాగునీరు అందుతుందని చెప్పారు. చింతలపూడి, నూజివీడు నియోజకవర్గంలోని మెట్ట ప్రాంత రైతుల భూములకు సమృద్ధిగా నీరు అందుతుందని, కాలువలు చెరువులు నింపడం ద్వారా భూగర్భ జలాలు పెరుగుతాయనీ, తాగునీటి సమస్యలు కూడా తీరుతాయని ఎంపీ వివరించారు.

‎ఒకవైపు పోలవరం ప్రాజెక్టు పనులు తుదిదశకు చేరుతున్నాయనీ, వచ్చే ఏడాది పోలవరం ప్రాజెక్టు ప్రారంభించబోతున్నామని చెప్పిన ఎంపీ ఇప్పుడు చింతలపూడి ప్రాజెక్టు పనులు కూడా మొదలు పెట్టడం ఏలూరు పార్లమెంట్ ప్రజలకు శుభవార్త అన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, రాష్ట్ర నీటిపారుదల శాఖా మంత్రి నిమ్మల రామానాయుడు పర్యవేక్షణలో రెండేళ్లలో ఈ ప్రాజెక్టును పూర్తిచేసి జాతికి అంకితం చేస్తామని ఎంపీ  స్పష్టం చేశారు. ఈ రెండు ప్రాజెక్టులు పూర్తయితే ఏలూరు జిల్లాలో నీటి కొరత ఉండదని తెలిపిన ఎంపీ, ఈ ప్రాజెక్టు కల సాకారం కావడానికి కృషి చేస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు, రాష్ట్రానికి అన్ని విధాలుగా సహకరిస్తున్న ప్రధాని నరేంద్ర మోదీకి, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్, మంత్రి నిమ్మల రామానాయుడులకు కృతజ్ఞతలు తెలియచేశారు. కూటమి ప్రభుత్వం చేస్తున్న ఈ అభివృద్దిని ప్రజలందరూ గుర్తించాలని, ఆయన అన్నారు