BREAKING
జమ్మూలో పాకిస్తానీయుల అక్రమ నివాసం: 65 మందిపై క్రైమ్ బ్రాంచ్ ఛార్జ్‌షీట్! బ్రోకర్ ట్రేడింగ్ టెర్మినళ్ల దుర్వినియోగానికి అడ్డుకట్ట: త్వరలో కఠిన నిబంధనలు తేనున్న సెబీ.. ఛైర్మన్ తుహిన్ కాంత పాండే కీలక ప్రకటన! నేటి పంచాంగం 25 అక్టోబర్ 2026 నేటి రాశి ఫలాలు –25 అక్టోబర్ 2026 అనివార్య కారణాలతో భారత్ పర్యటన రద్దు చేసుకున్న ఇరాన్ స్పీకర్ గలీబాఫ్: బెంగళూరు ట్రాఫిక్‌తో విసిగిపోయారా? రూ.3 లక్షల కార్ హ్యాక్‌తో నెటిజన్లను ఆశ్చర్యపరిచిన టెక్కీ ముంబై రెస్టారెంట్లపై ఎఫ్‌డీఏ కొరడా: ఒట్టోమన్ కేఫ్, భారత్ క్యాంటీన్ సహా 7 హోటళ్ల లైసెన్సులు రద్దు.. ఎఫ్‌1 యునైటెడ్ స్టేట్స్ గ్రాండ్ ప్రిక్స్ క్వాలిఫైయింగ్ లైవ్ స్ట్రీమింగ్: నవంబర్ 1న రాహుల్ గాంధీ ర్యాలీతో ఢిల్లీ మార్కెట్లకు రూ.10,000 కోట్ల దెబ్బ: కేరళ లోక్ భవన్ కిచెన్‌లో మాంసాహారంపై నిషేధం: బాధ్యతలు చేపట్టిన తొలిరోజే గవర్నర్ ఓం ప్రకాష్ మాథుర్ కీలక ఆదేశాలు.. ప్రోస్టేట్ క్యాన్సర్ కణతులను కరిగించే సరికొత్త ఔషధం: జాన్సన్ అండ్ జాన్సన్ 'JNJ-6143' ట్రయల్స్‌లో కీలక పురోగతి.. సౌదీ అరేబియాలో చిక్కుకున్న భారతీయ ఉమ్రా యాత్రికులకు కేంద్రం అండ: సంచాలన స్కూల్ ఆఫ్ డాన్స్ ఆధ్వర్యంలో మాస్టర్స్ ఎగ్జామినేషన్ కార్తీక్ సుబ్బరాజ్ 'డోరతీ' అరుదైన చిత్రం.. ట్రాన్స్‌జెండర్ల జీవితాలకు హ్యాపీ ఎండింగ్ ఇచ్చిన డైరెక్టర్! ట్యాంకర్ల ద్వారా నీటి వృథాను అరికట్టేందుకు కఠిన చర్యలు : నవంబర్ 1 నుంచి నిబంధనల ఉల్లంఘనకు రూ.5 వేల జరిమానా

బాలాజీ నగర్ డివిజన్‌లో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓటరు నమోదు కార్యక్రమం

Select Suryaa Now
బాలాజీ నగర్ డివిజన్‌లో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓటరు నమోదు కార్యక్రమం

కూకట్ పల్లి, మేజర్ న్యూస్:కూకట్‌పల్లి నియోజకవర్గం పట్టణ కాంగ్రెస్ మాజీ అధ్యక్షులు శేరి సతీష్ రెడ్డి ఆధ్వర్యంలో ఉమ్మడి రంగారెడ్డి–మహబూబ్‌నగర్–హైదరాబాద్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ఓటరు నమోదు కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా టీపీసీసీ అధికార ప్రతినిధి, సీనియర్ కాంగ్రెస్ నాయకులు డాక్టర్ సత్యం శ్రీరంగం, సీనియర్ కాంగ్రెస్ నాయకులు సాదు ప్రతాప్ రెడ్డి, కూకట్‌పల్లి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసిన బి. సంజీవరావు హాజరయ్యారు. 

బాలాజీ నగర్ డివిజన్ కాంగ్రెస్ అధ్యక్షులు రాజేష్ గౌడ్, సీనియర్ కాంగ్రెస్ నాయకులు గొట్టిముక్కల జశ్వంత్ రావు (దేశాల్), క్రిస్టియన్ మైనారిటీ కోఆర్డినేటర్ మేకల మైఖేల్, ఉమ్మడి కేపీహెచ్‌బీ డివిజన్ మాజీ అధ్యక్షులు తమ్మినేని ప్రవీణ్ కుమార్, కార్పొరేటర్ అభ్యర్థిగా పోటీ చేసిన విట్టల్ రెడ్డి, ఇతర కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, మహిళా నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మాట్లాడుతూ, పట్టభద్రులందరూ తమ ఓటు హక్కును నమోదు చేసుకోవాలని, ప్రజాస్వామ్య వ్యవస్థలో విద్యావంతుల భాగస్వామ్యం ఎంతో ముఖ్యమని పేర్కొన్నారు. పట్టభద్రుల ఓటరు నమోదు కార్యక్రమాన్ని మరింత విస్తృతంగా నిర్వహించి, అర్హులైన ప్రతి పట్టభద్రుడిని ఓటరుగా నమోదు చేయించేందుకు కృషి చేస్తామని తెలిపారు.