జనసైనికులతో టీడీపీ నేత కొలకలపూడి బ్రహ్మారెడ్డి ఆత్మీయ సమావేశం
జలదంకి, మేజర్ న్యూస్ : జలదంకి: మండలంలోని జనసేన నాయకులు, జనసైనికులతో టీడీపీ నేత కొలకలపూడి బ్రహ్మారెడ్డి ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జనసేన నాయకులు నిమ్మలపల్లి రామచైతన్య, తోట మురళి, కుందుర్తి శర్మ, గుండా బత్తిన రామ్మూర్తి, తేలపోలు రమేష్, పల్లెకొండ మాధవరావు, సింగమనేని అరవింద్, కాజా మస్తాన్, తొట్టెంపూడి రఘు, పోలిశెట్టి మహేంద్ర, కొల్లు అన్వేష్, తిరుపాలు, పెంచలయ్య, లు బ్రహ్మారెడ్డిని అభినందించారు. రానున్న ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లో సమిష్టి కృషితో ముందుకు సాగి విజయాన్ని సాధించాలని ఈ సందర్భంగా వారు పిలుపునిచ్చారు. కూటమి అభ్యర్థుల విజయమే లక్ష్యంగా నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో పనిచేయాలని ఆకాంక్షించారు.