వైసీపీ నామినేషన్లపై అభ్యంతరం తెలిపిన టీడీపీ.
ఉదయగిరి, మేజర్ న్యూస్ : మండలంలోని బండగానిపల్లి ఎంపీటీసీ స్థానానికి సంబంధించి వైసీపీ అభ్యర్థులు దాఖలు చేసిన నామినేషన్లు ఆమోదంపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ శనివారం టీడీపీ నాయకులు మండల ఎన్నికల రిటర్నింగ్ అధికారి వెంకటరెడ్డికి ఫిర్యాదు చేశారు. నామినేషన్ల పరిశీలన పక్రియ ముగిసిన అనంతరం టీడీపీ మం డల కన్వీనర్ బయ్యన్న, టీడీపీ మండల ప్రధాన కార్యదర్శి తుమ్మల కిరణ్ బా బు, నాయకులు ఆర్వోను కలిసి బండగానిపల్లి ఎంపీటీసీ స్థానానికి వైసీపీ వారు దాఖలు చేసిన నామి నేషన్ పత్రాల్లో జరిగిన తప్పిదాన్ని వివరించారు. నామినేషన్ పత్రంలోని ఒక పేజీలో మండలం పేరు ఉదయగిరి అని, ప్రాదేశికం పేరు బండగానిపల్లి రాయాల్సి ఉండగా రెండు కాలాల్లో ఉదయగిరి అని రాసి ఉన్నారని ఆర్వోకు వివరించారు. పరిశీలన చేసిన తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. దీంతో ఆర్వో మీకు ఏదైనా అభ్యంతరం ఉంటే ఉన్నతాధికారు ల దృష్టికి తీసుకెళ్లాలని నాయకులకు ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు ఏడుకొండలు, ప్రభాకర్ రె డ్డి, సయ్యద్ సంధా నీ, మతకాల శ్రీనివాసులు, శివకృష్ణ అభ్యంతరం వ్యక్తం చేశారు.