ఆదివారం శ్రీవారి కల్యాణం
ద్వారకా తిరుమల మేజర్ న్యూస్: ద్వారకాతిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆశ్వయుజ మాస తిరు కళ్యాణ మహోత్సవం ఆదివారం రాత్రి 8 గంటలకు జరుగుతుందని ఆలయ కార్యనిర్వాహణాధికారి వేండ్ర త్రినాధరావు తెలిపారు. ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని అన్నారు. స్వామివారి కల్యాణాన్ని తిలకించి తీర్థప్రసాదాలు స్వీకరించాలని ఆయన కోరారు.