కౌంటింగ్ కేంద్రాలను పరిశీలించిన జిల్లా కలెక్టర్
రామచంద్రపురం మ్యూజిక్ న్యూస్ :రామచంద్రపురం పట్టణంలో మున్సిపల్, జడ్పిటిసి ఎంపీటీసీ ఎన్నికలకు సంబంధించిన కౌంటింగ్ కేంద్రాలను స్ట్రాంగ్ రూములను జిల్లా కలెక్టర్ డాక్టర్ ఆర్ మహేష్ కుమార్ శనివారం పరిశీలించారు. పట్టణంలోని చింతపల్లి సూరన్న నగర్ లోని మున్సిపల్ ఎన్నికలకు సంబంధించిన కౌంటింగ్ కేంద్రాలను స్ట్రాంగ్ రూములను పరిశీలించి సహాయ ఎన్నికల అథారిటీ, కమిషనర్ కేవీఆర్కే రాజు ను వి వివరాలు అడిగి తెలుసుకుని పలు సూచన చేశారు.
అనంతరం పట్టణంలో ఎస్కే పీజియన్ జూనియర్ కళాశాలలో జడ్పిటిసి ఎంపిటిసి ఎన్నికలకు సంబంధించి కౌంటింగ్ కేంద్రాలను స్ట్రాంగ్ రూములను కలెక్టర్ మహేష్ కుమార్ పరిశీలించారు స్ట్రాంగ్ రూముల భద్రత వాలెట్ బాక్సులు భద్రపరచడం కౌంటింగ్ హాలు ఏర్పాట్లు భారీ బారికెట్లు విద్యుత్ తాగునీరు ఉత్తర మౌలిక సదుపాయాలను పరిశీలించి ఎన్నికల నిర్వహణకు అవసరమైన అన్ని ఏర్పాట్లు సకాలంలో పూర్తి చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు డి.ఎస్.పి ఎం శేషు ఇతర ఎన్నికల అధికారులు పాల్గొన్నారు