అనాకోడేరులో అక్రమ మద్యం విక్రయాలు.. ఒకరి అరెస్టు బెల్ట్ షాపుపై ఎక్సైజ్ అధికారుల దాడి.. 6 మద్యం సీసాలు స్వాధీనం
భీమవరం: పశ్చిమగోదావరి జిల్లా భీమవరం మండలం అనాకోడేరు గ్రామంలో అక్రమంగా మద్యం విక్రయిస్తున్న వ్యక్తిని ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ అధికారులు అరెస్టు చేశారు. అతని వద్ద నుంచి ఆరు మద్యం సీసాలను స్వాధీనం చేసుకున్నారు.భీమవరం ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ స్టేషన్ పరిధిలో శనివారం నిర్వహించిన దాడుల్లో భాగంగా అనాకోడేరులో అక్రమ మద్యం విక్రయాలు జరుగుతున్నట్లు గుర్తించి అధికారులు ఈ చర్యలు చేపట్టారు. అక్రమంగా మద్యం విక్రయిస్తున్న వ్యక్తిని అదుపులోకి తీసుకుని, అతని వద్ద ఉన్న ఆరు మద్యం సీసాలను స్వాధీనం చేసుకున్నట్లు ఎక్సైజ్ ఇన్‌స్పెక్టర్ జి. బసంతి తెలిపారు.ఈ దాడుల్లో ఎక్సైజ్ ఎస్‌ఐలు పి. ఉమామహేశ్వరరావు, పి. సునీల్ కుమార్‌తో పాటు సిబ్బంది పాల్గొన్నారు. అక్రమ మద్యం విక్రయాలపై నిఘా కొనసాగిస్తామని అధికారులు తెలిపారు.