గ్రామాల వారీగా అభివృద్ధి పై సమీక్ష నిర్వహించిన మంత్రి
ఆత్మకూరు/ మేజర్ న్యూస్:
వనపర్తి జిల్లా ఆత్మకూరు పట్టణంలో కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నందు శనివారం రాష్ట్ర పశుసంవర్ధక క్రీడా శాఖ మంత్రి డాక్టర్ వాకిటి శ్రీహరి గ్రామాల వారిగా అభివృద్ధి పనులపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ప్రతి గ్రామంలో అభివృద్ధి పనులను గ్రామ నాయకులు సూచించి ఇవ్వాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు నాగేశ్వర్ పట్టణ అధ్యక్షులు ఈర్లదిన్నె శ్రీనివాసులు ,మున్సిపల్ చైర్ పర్సన్ నాగమణి రాజేష్, వైస్ చైర్మన్ నల్గొండ శ్రీనివాసులు, మార్కెట్ కమిటీ చైర్మన్ రహమతుల్లా, వివిధ గ్రామాల కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.
_రాజా రత్నం, ఆత్మకూరు వరపర్తి జిల్లా.