BREAKING
జనగామ గోడుకు స్పందన! సుప్రీంకోర్ట్ ఎ.జి.ఎస్ కు రాజ్యాంగం గ్రంథం బహుకరణ రాజన్న గుడిలో విజిలెన్స్ సెగ ధూమ్ 4 లో సూపర్‌స్టార్ మహేష్ బాబు.. బాలీవుడ్ భారీ ఆఫర్‌ను రిజెక్ట్ చేశారా? టీడీపీ జెండా ఎగరడం ఖాయం కొండగట్టు అంజన్న ను దర్శించుకున్న తెలంగాణ రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి నరసింగరావు. రాయదుర్గం 13వ వార్డులో టీడీపీ కౌన్సిలర్ అభ్యర్థి జి.హరిప్రియ ఎన్నికల ప్రచారం జోరు - ఇంటింటికి తిరిగి ఓట్ల అభ్యర్థన ఆదివారం శ్రీవారి కల్యాణం ఆకాశంలో ఒక తార: దుల్కర్ చిత్రంలో బిజిలీగా రుహానీ శర్మ.. ఆకట్టుకుంటున్న ఫస్ట్ లుక్! కుందుర్పి ఎంపిటిసిల అభ్యర్థుల జాబితా. 14వ వార్డులో చైర్ పర్సన్ అభ్యర్థి శైలజ, నాయుడు విసృతప్రచారం మండలంలో నామినేషన్లు అన్ని సక్రమమే -- అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారి సునీత కొలువుదీరనున్న ఏఎంసీ నూతన పాలకవర్గం.… పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓటరు నమోదును విస్తృతంగా చేపట్టాలి కొరటికల్‌లో భారీ చోరీ.. 10 తులాల బంగారం, రూ.1.50 లక్షల నగదు మాయం !

బైక్ ని ఢీ కొట్టిన గుర్తుతెలియని వాహనం

Select Suryaa Now
బైక్ ని ఢీ కొట్టిన గుర్తుతెలియని వాహనం

యువకుడికి తీవ్ర గాయాలు  - పరిస్థితి విషమం ఖమ్మం తరలింపు

పెనుబల్లి సూర్య మేజర్ న్యూస్...
(కిరణ్ కుమార్ ఆరిక)
పెనుబల్లి మండలం విఎం బంజర గ్రామంలో శనివారం సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదంలో రోడ్డు ఒక యువకుడికి తీవ్ర గాయాలు అయ్యాయి. పెనుబల్లి మండలం వి ఎం బంజర  పోలీస్ స్టేషన్ కు కూతవేటు దూరంలో ఖమ్మం వైపు వెళ్లే జాతీయ రహదారిపై బైక్ పై వెళుతున్న యువకుడిని గుర్తు తెలియని వాహనం ఢీకొట్టడంతో  రోడ్డు ప్రమాదం సంభవించింది. క్షతగాత్రుడు టేకులపల్లి గ్రామానికి చెందిన కోమటి రామకృష్ణగా గుర్తించారు. సమాచారం అందుకున్న విఎం బంజర ఎస్సై షేక్ షాకీర్ స్థలానికి చేరుకొని పరిశీలించారు. సమాచారం అందుకున్న 108 సిబ్బంది  టెక్నీషియన్ రమేష్, పైలెట్ రమేష్ క్షణాల వ్యవధిలో ఘటన స్థలానికి చేరుకొని క్షతగాత్రుడికి ప్రథమ చికిత్స అందించి పెనుబల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. బాధితుడు సీతానగర్  పామాయిల్ కంపెనీలో పనిచేస్తూ ద్విచక్ర వాహనంపై ఇంటికి తిరుగు ప్రయాణం అయ్యాడు. ఇంటికి మూడు కిలోమీటర్ల దూరంలో ఉండగా ఖమ్మం నుండి సత్తుపల్లి వైపు వెళ్తున్న గుర్తు తెలియని లారీ ఢీకొనడంతో తలభాగంలో బలమైన గాయాలు అయ్యాయి. పెనుబల్లి ప్రభుత్వ ఆసుపత్రిలో  ప్రథమ చికిత్స అనంతరం ఖమ్మం తరలించారు. ఈ రోడ్డు ప్రమాదంపై  విఎం బంజర పోలీస్ స్టేషన్ ఎస్సై షాకీర్ విచారణ చేపట్టారు.