14వ వార్డులో చైర్ పర్సన్ అభ్యర్థి శైలజ, నాయుడు విసృతప్రచారం
నరసాపురం, మేజర్ న్యూస్ :పురపాలక సంఘం పరిధిలోని 14వ వార్డులో ఎన్డీయే కూటమి అభ్యర్థుల తరఫున ప్రచారం హోరెత్తింది. కూటమి బలపరిచిన జనసేన పార్టీ అభ్యర్థినులు చైర్‌పర్సన్ అభ్యర్థిగా కొత్తపల్లి శైలజ 14వ వార్డు కౌన్సిలర్ అభ్యర్థిగా తోట సూర్యకుమారి ల విజయానికై తెలుగుదేశం పార్టీ రాష్ట్ర సీనియర్ నాయకులు, కొవ్వలి ఫౌండేషన్ చైర్మన్ కొవ్వలి యతిరాజ రామ్మోహన్ నాయుడు శనివారం విస్తృతంగా ప్రచారం నిర్వహించారు.
ఈ సందర్భంగా వార్డులోని ప్రతి ఇంటినీ సందర్శిస్తూ స్థానికులతో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నేతృత్వంలో కూటమి ప్రభుత్వం అభివృద్ధి పథంలో దూసుకుపోతోందని, స్థానికంగా కూడా సమగ్ర అభివృద్ధి జరగాలంటే కూటమి అభ్యర్థుల విజయం ఎంతో కీలకమని పేర్కొన్నారు. ప్రజాసేవే ధ్యేయంగా బరిలో నిలిచిన చైర్‌పర్సన్ అభ్యర్థిని కొత్తపల్లి శైలజ జానకీరామ్, కౌన్సిలర్ అభ్యర్థిని తోట సూర్యకుమారి నానిలకు గాజు గ్లాస్ గుర్తుపై తమ అమూల్యమైన ఓటు వేసి అఖండ మెజారిటీతో గెలిపించాలని ప్రజలను కోరారు. వార్డులో నెలకొన్న సమస్యలను పరిష్కరించి, ఆదర్శ వార్డుగా తీర్చిదిద్దుతామని భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో సంకు భాస్కర్ నాయుడు,భూపతి నరేష్, మల్లాడి మూర్తి,గుడాల సునీత నాని, ముస్కోడి రవి, మౌలాలి, రావి అప్పాజీ ఎన్డీయే కూటమి నాయకులు, కార్యకర్తలు, కొవ్వలి ఫాలోవర్స్ తదితరులు పాల్గొన్నారు.