మండలంలో నామినేషన్లు అన్ని సక్రమమే -- అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారి సునీత
నరసాపురం రూరల్, మేజర్ న్యూస్ :మండల పరిషత్ కార్యాలయంలో మూడు రోజులపాటు స్వీకరించిన ఎంపీటీసీ ఎన్నికలకు సంబంధించిన నామినేషన్లు అన్ని సక్రమంగానే ఉన్నాయని ఎన్నికల అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారి జి సునీత ప్రకటించారు. మూడు రోజులపాటు స్వీకరించిన వివిధ పార్టీలు, ఇండిపెండెంట్ అభ్యర్థుల నామినేషన్లను పరిశీలించారు. మొత్తం 28 గ్రామాలకు చెందిన 23 ఎంపీటీసీల ఎన్నిక కొరకు101 నామినేషన్లు వచ్చాయని, వాటన్నింటిని పూర్తిస్థాయిలో పరిశీలించినట్లు అన్ని సక్రమంగానే ఉన్నాయని సునీత ప్రకటించారు.