BREAKING
ఖండవల్లిలో కూటమి జడ్పీటీసీ అభ్యర్థి ఇంటింటా ఎన్నికల ప్రచారం రూ.195 కోట్లతో నిడదవోలు పట్టణాభివృద్ధి:మంత్రి కందుల దుర్గేష్ ఎస్ జి ఎఫ్ రాష్ట్ర స్థాయి హాకీ పోటీలకు పందలపాక విద్యార్థులు ఎంపిక జనసేన పార్టీ నుండి వైయస్సార్ పార్టీలో చేరికలు నేటి పంచాంగం 26 అక్టోబర్ 2026 నేటి రాశి ఫలాలు –26 అక్టోబర్ 2026 అంబాజీపేటలో శ్రీ విజయ భేతాళస్వామి వాహన మహోత్సవం.. గుగులోతు రామస్వామి నాయక్ కు ఘన సన్మానం అర్హులైన ప్రతి ఒక్కరూ ఓటు నమోదు చేసుకోవాలి-డిసిసి ప్రధాన కార్యదర్శి శ్రీపాల్ రెడ్డి ప్రమాదవశాత్తు నిప్పంటుకొని వృద్ధురాలికి తీవ్ర గాయాలు గంజాయి రవాణా చేస్తున్న మహారాష్ట్ర పోలీస్ కానిస్టేబుల్-ఆరు లక్షల విలువైన 12 కిలోల గంజాయి పట్టివేత సాయినగర్ కాలనీలో ఎమ్మెల్సీ పట్టభద్రుల ఓటరు నమోదు ఎన్‌టీఆర్‌ నగర్‌లో కిడ్నాప్‌ కలకలం.... గంటల్లోనే కిడ్నాప్‌నకు గురైన వ్యక్తిని గుర్తించిన గచ్చిబౌలి పోలీసులు . జీహెచ్‌ఎంసీ మహిళా కార్మికులకు చీరల పంపిణీ చేసిన బలరాం యాదవ్ పట్టభద్రులు ఓటర్లుగా నమోదు కావాలి: బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు

కొరటికల్‌లో భారీ చోరీ.. 10 తులాల బంగారం, రూ.1.50 లక్షల నగదు మాయం !

Select Suryaa Now
కొరటికల్‌లో భారీ చోరీ.. 10 తులాల బంగారం, రూ.1.50 లక్షల నగదు మాయం !

 

ఉప్పునుంతల సూర్య న్యూస్ : ఉప్పునుంతల మండలం కొరటికల్ గ్రామంలో చోరీ ఘటన చోటుచేసుకుంది. గుర్తుతెలియని వ్యక్తులు ఇంటి వెనుక కిటికీని ధ్వంసం చేసి ఇంట్లోకి ప్రవేశించి, 10 తులాల బంగారు ఆభరణాలతో పాటు రూ.1.50 లక్షల నగదును అపహరించారు.గ్రామానికి చెందిన గోపిరెడ్డి భారతమ్మ (70), ఆమె భర్త బచ్చిరెడ్డి (75) శుక్రవారం ఇంటికి తాళం వేసి డిండి గ్రామానికి వెళ్లారు. శనివారం తిరిగి వచ్చి చూడగా, ఇంటి వెనుక కిటికీ ధ్వంసమై ఉండటాన్ని గుర్తించారు. ఇంట్లో పరిశీలించగా సుమారు 7 తులాల బంగారు చంద్రహారం, 3 తులాల బంగారు కంకణాలు, రూ.1.50 లక్షల నగదు కనిపించకపోవడంతో చోరీ జరిగినట్లు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు.సమాచారం అందుకున్న ఉప్పునుంతల ఎస్సై పుట్ట మహేష్ గౌడ్ మరియు క్లూస్ టీం సంఘటనా స్థలాన్ని పరిశీలించి సమాచారాన్ని సేకరించారు. ఘటనపై విచారణ చేపట్టి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.