అఫిలియేషన్ 5 సం లకు ఒకసారి ఇవ్వాలి
మహబూబ్ నగర్ సూర్య న్యూస్ -వచ్చే విద్యా సంవత్సరం నుండి ప్రైవేట్ జూనియర్ కళాశాలకు అఫీలియేషన్ ఐదు సంవత్సరాలు ఒకేసారి ఇవ్వాలని తెలంగాణ ప్రైవేట్ జూనియర్ కళాశాల యాజమాన్య సంఘం జిల్లా అధ్యక్షులు విజేత వెంకట్ రెడ్డి హైదరాబాద్ సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో శనివారం నిర్వహించిన రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో ప్రభుత్వాన్ని విన్నవించారు.బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ అధికారులు అనుబంధ గుర్తింపు ఇచ్చిన తర్వాత కూడా టాస్క్ ఫోర్స్ వారు ప్రైవేట్ కళాశాలపై దాడులు నిర్వహించడం చాలా బాధాకరమని తెలిపారు .ఈ కార్యక్రమంలో జిల్లాలోని అన్ని ప్రైవేట్ జూనియర్ కళాశాల యాజమాన్య సభ్యులు పాల్గొన్నారు.ఉమ్మడి జిల్లా సెక్రెటరీ రమేష్ గౌడ్, సంఘం సభ్యులు మధుమోహన్ ,విజయ్ కుమార్, రాఘవేందర్ రావు, వెంకటేశ్వర్లు మురళి, జగన్ తదితరులు పాల్గొన్నారు.
ఓం ప్రకాష్..మహబూబ్ నగర్