BREAKING
ప్రతి నీటి బొట్టు ను ఒడిసి పట్టాలి -వరంగల్ జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద చివరి రెండు రోజులు సందడిగా మారిన ‘షీ-2026’ చేనేత వస్త్ర ప్రదర్శన చేనేత చీరల కొనుగోలుకు ఆసక్తి చూపిన వస్త్రాభిమానులు ఆధ్యాత్మిక ప్రచారుకులకు ఘన సత్కారం హరీష్ రావును మర్యాదపూర్వకంగా కలిసిన బీఆర్ఎస్ నేతలు ముద్రా థెరపీతో అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు.. చేతి వేళ్లతో రోగాలను నయం చేయవచ్చా! ఈ ఫ్లెక్సీ లకు ఎన్నికల కోడ్ వర్తించదా...! రూరల్ పోలీస్ స్టేషన్ కు ఎదురుగా కూటమి నేతల బ్యానర్లు వెంగళరావు నగర్‌లో పట్టభద్రుల ఓటరు నమోదు ​పరిశ్రమల ప్రమాదాలపై ప్రభుత్వం, అధికారుల నిర్లక్ష్యం బాధాకరం ​ఫ్యాక్టరీస్ ఇన్‌స్పెక్టర్లు, డైరెక్టర్ల ఖాళీలను తక్షణమే భర్తీ చేయాలి తోమాల సేవలకు జనార్ధన స్వామి చిత్రపటం అందజేత నవంబర్ 21న చెక్ బౌన్స్ కేసులపై లోక్ అదాలత్ -- న్యాయమూర్తి వాసంతి పట్టభద్రుల ఓటు నమోదు కోసం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ప్రత్యేక కౌంటర్ కివీస్‌తో మ్యాచ్‌లో చెలరేగిన తిలక్ వర్మ.. ఆరంభంలో ఆచితూచి ఆడి చివర్లో అద్భుత బ్యాటింగ్! ఎన్ఎండీసీ టీపీజీఎల్ సీజన్‌-6 గోల్ఫ్ టోర్నీ ప్రారంభం టీ-ఆఫ్ చేసి ప్రారంభించిన డీజీపీ సీవీ ఆనంద్‌ కడియం లో 115 నామినేషన్ శ్రీ భద్రకాళి అమ్మవారిని దర్శించుకున్న గరివిడి లక్ష్మి చిత్ర యూనిట్

రోడ్డు ప్రమాద బాధితులకు మెరుగైన వైద్యం అందించేందుకు పీఎం రాహత్ పథకంను సద్వినియోగం చేసుకోవాలి

Select Suryaa Now
రోడ్డు ప్రమాద బాధితులకు మెరుగైన వైద్యం అందించేందుకు పీఎం రాహత్ పథకంను సద్వినియోగం చేసుకోవాలి
సూర్య నిజామాబాద్ జిల్లా ప్రతినిధి:  రోడ్డు ప్రమాద బాధితులకు మెరుగైన వైద్యం అందించడంలో పీఎం రాహత్ పథకం కీలకంగా నిలుస్తుందని, దీనిని సద్వినియోగం చేసుకునేలా చూడాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు సూచించారు. పీఎం రాహత్ (ప్రైమ్ మినిస్టర్ రోడ్ ఆక్సిడెంట్ విక్టిమ్స్ హాస్పిటలిజేషన్ అండ్ అస్యూర్డ్ ట్రీట్మెంట్) పథకం అమలుపై సంబంధిత శాఖల ఉన్నతాధికారులతో కలిసి సీ.ఎస్ సంజయ్ జాజు శనివారం అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. రోడ్డు ప్రమాద బాధితులకు సకాలంలో అత్యవసర వైద్యం అందించడం, ప్రభుత్వ, ప్రైవేట్ ఆసుపత్రుల అనుసంధానం, నిధుల విడుదల ప్రక్రియపై చర్చించారు. రోడ్డు ప్రమాదం జరిగిన వెంటనే బాధితుడిని ఆసుపత్రిలో చేర్పించడానికి పోలీస్ ఆమోదిత కేసులకు గరిష్టంగా 1 లక్షా 50 వేల రూపాయల వరకు పూర్తి చికిత్స అందించే అవకాశం ఈ పథకం ద్వారా లభిస్తుందని పేర్కొన్నారు. ప్రమాదం తర్వాత బాదితుల ప్రాణాలు కాపాడేందుకు గోల్డెన్ అవర్ ఎంతో కీలకమని, ఈ సమయంలో వేగంగా స్పందించాలని అన్నారు. ఈ పథకం సమర్థవంతమైన అమలు కోసం జిల్లా కలెక్టర్లు రహదారి భద్రత కమిటీలతో సమన్వయం చేసుకొని, జిల్లా ఇన్ఫర్మాటిక్స్ అధికారులను కూడా ఇందులో భాగస్వామ్యం చేయాలని సూచించారు.  
 
          ప్రమాదాల నివారణకు, బాధితుల వివరాలను పారదర్శకంగా నమోదు చేయడానికి టీఎంఎస్ 2.0 పోర్టల్‌ను సద్వినియోగం చేసుకోవాలని స్పష్టం చేశారు. జనరల్ ఇన్సూరెన్స్ ద్వారా బాధితుల చికిత్స ఖర్చులను నేరుగా ఆసుపత్రులకు చెల్లించే విధానాన్ని పకడ్బందీగా అమలు చేయాలని ఆదేశించారు. ప్రజలలో ఈ పథకంపై అవగాహన కల్పించాలని అన్నారు. ప్రతి జిల్లాలోనూ ఈ పథకం అమలును కలెక్టర్లు ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని సీఎస్ స్పష్టం చేశారు. వీసీ అనంతరం కలెక్టర్ ఇలా త్రిపాఠి అధికారులకు పలు సూచనలు చేశారు. పీఎం రాహత్ పథకాన్ని జిల్లాలో సమర్థవంతంగా అమలు చేయాలన్నారు. రోడ్డు ప్రమాద బాధితులకు తక్షణ వైద్య సేవలు అందించి, వారి ప్రాణాలు కాపాడే ప్రయత్నం చేయాలన్నారు. ప్రమాద సమాచారం అందుకున్న వెంటనే సంబంధిత శాఖలు వెంటనే అప్రమత్తమవ్వాలని అన్నారు. నగదు, బాదితుల సమాచారం అందుబాటులో లేని కారణంగా వైద్యసేవలు నిరాకరించకూడదన్నారు. సంబంధిత శాఖల అధికారులు సమన్వయంతో ఉండి ప్రమాదాల వల్ల కలిగే ప్రాణ నష్టాలను తగ్గించాలని తెలిపారు.ఈ వీసీలో అదనపు కలెక్టర్ లు రాజాగౌడ్, భుజంగరావు, జిల్లా రవాణా శాఖ అధికారి రమేష్ రాథోడ్, వైద్యారోగ్య శాఖ అధికారిణి డాక్టర్ రాజశ్రీ, జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ రాములు, జిల్లా ఆసుపత్రుల సమన్వయకర్త డాక్టర్ శ్రీనివాస్ ప్రసాద్, ట్రాఫిక్ ఏసీపీ మస్తాన్ అలీ, ఈ-దార్ జిల్లా మేనేజర్ వర్ష నిహంత్ తదితరులు పాల్గొన్నారు.