సూర్య మల్యాల :కొండగట్టు శ్రీ ఆంజనేయ స్వామి వారిని తెలంగాణ రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి శ్రీ నరసింగరావు కుటుంబ సమేతంగా శనివారం దర్శించుకున్నారు.ఈ సందర్భంగా ఆలయ అధికారులు పూర్ణకుంభంతో ఘన స్వాగతం పలికారు. అనంతరం ఆలయ అధికారులు న్యాయమూర్తి ని స్వామివారి శేషవస్త్రంతో సత్కరించి, తీర్థప్రసాదాలు అందజేశారు. అర్చకులు, వేద పండితులు వేదాశీర్వచనం అందించారు. ఈ కార్యక్రమంలో ఆలయ అధికారులు అర్చకులు తదితరులు పాల్గొన్నారు