పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓటరు నమోదును విస్తృతంగా చేపట్టాలి
కందుకూరు: పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో అర్హులైన పట్టభద్రులందరూ ఓటరుగా నమోదు చేసుకునేలా గ్రామాల్లో ఇంటింటా అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని టిపిసిసి ప్రధాన కార్యదర్శి ఏనుగు జంగారెడ్డి పిలుపునిచ్చారు. మహేశ్వరం నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ కిచ్చన్న గారి లక్ష్మారెడ్డి ఆదేశాల మేరకు కందుకూరు మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు రాణా ప్రతాపరెడ్డి ఆధ్వర్యంలో శనివారం కందుకూరు మండల కేంద్రంలోని సీతారామశాస్త్రి కళ్యాణ మండపంలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓటరు నమోదు కార్యక్రమంపై సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రతి గ్రామంలో ఇంటింటికీ వెళ్లి, 2023కు పూర్వం డిగ్రీ పూర్తి చేసి మూడేళ్లు గడిచిన అర్హులైన పట్టభద్రులను గుర్తించి ఓటరుగా నమోదు చేయించాలని నాయకులకు సూచించారు.కాంగ్రెస్ పార్టీ బీఎల్ఏలు, గ్రామ శాఖ అధ్యక్షులు, ఇందిరమ్మ కమిటీ చైర్మన్లు, సభ్యులు, ఉప సర్పంచులు, వార్డు సభ్యులు, మాజీ ఎంపీటీసీలు, మాజీ జెడ్పీటీసీలు, సీనియర్ కాంగ్రెస్ నాయకులు సమన్వయంతో పనిచేసి అర్హులైన ప్రతి ఒక్కరూ ఓటు నమోదు చేసుకునేలా కృషి చేయాలని కోరారు.
ఈ సమావేశంలో మార్కెట్ కమిటీ చైర్మన్ సభావత్ కృష్ణ నాయక్,సర్పంచులు బైరు కొండల్ రెడ్డి, బాల్రాజ్, పల్స కృష్ణ గౌడ్,అనిత సుమలత కృష్ణ, ఏఎంసీ డైరెక్టర్లు విష్ణువర్ధన్ రెడ్డి, యుగేందర్ గౌడ్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు బొక్క భూపాల్ రెడ్డి, వరికుప్పల బాబు, అఫ్జల్ బేగ్, అందుగుల సత్యనారాయణ, బుక్క పాండురంగారెడ్డి, రాకేష్ గౌడ్, సంజీవరెడ్డి, శేఖర్ గౌడ్, మాధవరెడ్డితో పాటు వివిధ గ్రామాల శాఖ అధ్యక్షులు, బి ఎల్ ఏ లు, ఉప సర్పంచులు,ప్రజాప్రతినిధులు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.
టి. శ్రీనివాస్ మేజర్ న్యూస్