రామ్ రెడ్డి డైరీ పాల కేంద్రంపై ఫుడ్ ఇన్‌స్పెక్టర్ తనిఖీలు నెయ్యి, పన్నీర్ నమూనాల సేకరణ
సంగారెడ్డి; సంగారెడ్డి పట్టణం కలెక్టర్ ఆఫీస్ దగ్గరలో రామ్ రెడ్డి డైరీ పాల కేంద్రంపై ఫుడ్ ఇన్‌స్పెక్టర్ రాజేష్ శనివారంతనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా కేంద్రంలో విక్రయిస్తున్న నెయ్యి, పన్నీర్ నాణ్యతను పరిశీలించేందుకు నమూనాలను (శాంపిళ్లను) సేకరించారు.సేకరించిన నమూనాలను నాణ్యతా పరీక్షల నిమిత్తం ప్రయోగశాలకు పంపించనున్నట్లు తెలుస్తోంది. పరీక్షల ఫలితాల ఆధారంగా ఆహార భద్రతా నిబంధనల ప్రకారం తదుపరి చర్యలు తీసుకునే అవకాశం ఉంది.వినియోగదారులకు నాణ్యమైన ఆహార పదార్థాలు అందేలా అధికారులు తనిఖీలు చేపట్టడం ప్రాధాన్యత సంతరించుకుంది.