28న జిల్లా స్థాయి రోల్‌ప్లే, జానపద నృత్య పోటీలు
నరసరావుపేట : జిల్లాలోని పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు ఈ నెల 28న జిల్లా స్థాయి రోల్‌ప్లే, జానపద నృత్య పోటీలు నిర్వహించ నున్నట్లు జిల్లా విద్యాశాఖాధి కారి, డైట్ కళాశాల ప్రిన్సిపల్ పీవీజే రామా రావు ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సంద ర్భంగా పీవీజే రామారావు మాట్లాడుతూ స్థానిక జిల్లా విద్యా శిక్షణ సంస్థ (డైట్) ప్రాంగణంలో పోటీలు జరుగుతాయని పేర్కొన్నారు. జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో 8, 9 తరగతులు చదువుతున్న విద్యార్థులు పాల్గొనేందుకు అర్హులని వివరించారు. రోల్‌ప్లే పోటీల్లో ఒక్కో జట్టులో నలుగురు నుంచి ఐదుగురు, జానపద నృత్య పోటీల్లో ఐదుగురు నుంచి ఆరుగురు విద్యార్థులు ఉండాలని సూచించారు. రోల్‌ప్లేలో పాల్గొనేవారు తప్పనిసరిగా పాఠశాల యూనిఫాం ధరించాలని, జానపద నృత్యాలకు సంప్రదాయ దుస్తులు ధరించవ చ్చని తెలిపారు. పర్యావరణ పరిరక్షణ, వ్యక్తిగత, మానసిక ఆరోగ్యం, వ్యక్తుల మధ్య సంబంధాలు, మానవీయ విలువలు, పౌర బాధ్యతలు, లింగ సమానత్వం, పోషకా హారం, ఏకాగ్రత, మాదకద్రవ్యాల దుర్విని యోగ నివారణ తదితర సామాజిక అంశాలపై ప్రదర్శనలు ఇవ్వాల్సి ఉంటుందన్నారు. ఆసక్తి గల విద్యార్థులు డబ్ల్యూ డబ్ల్యూ డబ్ల్యూ. ఎన్పిఇపిఎన్సి ఇఆర్టీ.ఇన్ వెబ్‌సైట్‌లో పేర్లు నమోదు చేసుకోవాలని సూచించారు. మరిన్ని వివరాలకు నోడల్ అధికారి పి.పోలేరు (9704790917)ను సంప్రదించవచ్చన్నారు. విద్యార్థుల్లో సృజనాత్మకత, కళాత్మక నైపుణ్యాలను వెలికితీసేందుకు నిర్వహిస్తున్న ఈ పోటీల్లో అధిక సంఖ్యలో పాల్గొనేలా ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు ప్రోత్సహించాలని డీఈవో రామారావు తెలిపారు.
మల్లికార్జునరావు పల్నాడు జిల్లా ఇన్చార్జి