క్రాస్ కంట్రీలో వాగ్దేవి విద్యార్థుల సత్తా
నరసరావుపేట : ఆచార్య నాగార్జున విశ్వ విద్యాలయం ఆధ్వర్యంలో బాపట్ల జిల్లా ఖాజీపాలెంలో నిర్వహించిన అంతర్ కళాశాలల క్రాస్ కంట్రీ పోటీల్లో నరసరావు పేట వాగ్దేవి డిగ్రీ కళాశాల విద్యార్థులు సత్తా చాటారు. 10 కిలోమీటర్ల పరుగు పోటీలో కె.రఘువేంద్ర ప్రథమ స్థానం సాధించి బంగారు పతకం, వి.లక్ష్మణ్ ద్వితీయ స్థానంలో నిలిచి రజత పతకం కైవసం చేసుకున్నారు. 11 కళాశాలల నుంచి 132 మంది పాల్గొన్న ఈ పోటీల్లో ప్రతిభ కనబరిచిన వీరిద్దరూ నవంబరు 11 నుంచి 15 వరకు మంగళూరులో జరిగే అఖిల భారత అంతర్ విశ్వవిద్యాలయ పోటీలకు ఎంపికయ్యారు. విజేతలను కళాశాల చైర్మన్ కాట్ల రామకోటేశ్వరరావు, కరస్పాండెంట్ రాయల శ్రీనివాసరావు, ప్రిన్సిపాల్ కె. రాజేంద్రప్రసాద్, క్రీడా విభాగం అధికారులు, అధ్యాపకులు అభినందించారు.
మల్లికార్జునరావు పల్నాడు జిల్లా ఇన్చార్జి…