చికిత్స పొందుతూ వ్యక్తి మృతి డీసీఎం ఢీ కొట్టిన ఘటనలో మృత్యు ఒడిలోకి మూడో వ్యక్తి
సూర్యాపేట రూరల్ : ఈనెల 16న మండల పరిధిలోని బాలెంల లో స్టేజి సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు అక్కడికక్కడే మృతిచెందగా మరో వ్యక్తి తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చేరారు. గ్రామానికి చెందిన గుర్రం సైదులు, ఆలకుంట్ల నాగరాజు, గోళ్ళ జానయ్య, అశోక్ లు మార్నింగ్ వాక్ కోసం జనగాం సూర్యాపేట రహదారిపై నడుస్తుండగా అతివేగంగా అజాగ్రత్తగా వచ్చిన డీసీఎం ఢీకొట్టడంతో గుర్రం సైదులు ఆలకుంట నాగరాజు అక్కడికక్కడే మృతి చెందారు అశోక్ ప్రమాదం నుండి బయటపడగా తీవ్ర గాయాల పాలైన గొల్ల జానయ్య ఆసుపత్రిలో చేరి మృత్యువుతో పోరాడారు. మెరుగైన వైద్య చికిత్స నిమిత్తం హైదరాబాద్ తరలించగా పరిస్థితి చేయి దాటిపోవడంతో తిరిగి సూర్యాపేట జనరల్ ఆస్పత్రికి పంపారు. చికిత్స పొందుతూ శనివారం తుది శ్వాస విడిచినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఇప్పటికే ఇద్దరు మృతి చెందగా మరో వ్యక్తి మృతి చెందడంతో బాలెంల గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.