BREAKING
రాష్ట్రాల ఎన్నికలను స్వాధీనం చేసుకునే ఉద్దేశం ట్రంప్‌కు లేదు మునిగిపోతున్న నౌక-40 మంది ఇరాన్ నావికులను రక్షించిన ఎస్ఎల్ నేవీ 32వ డివిజన్ ను అన్ని విధాలుగా అభివృద్ది చేయడమే లక్ష్యం.. టిడిపి కార్పొరేటర్ అభ్యర్థి బట్టే వెంకట కీర్తి... వెనిజులాకు తిరిగి వచ్చిన ప్రముఖ ప్రతిపక్ష నేత మరియా కొరినా మచాడో తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీక అలయ్ బలయ్ డిక్లరేషన్ ఫామ్స్ ఇచ్చిన ఎమ్మెల్యే ఎరపతినేని ఇటలీ లీగ్ పార్టీ నేతగా మళ్లీ ఎన్నికైన మట్టేయో సాల్విని భారత్ ఆర్ట్స్ అకాడమీ ఆధ్వర్యంలో పద్మభూషణ్ వెంపటి చిన్న సత్యం జయంతి వేడుకలు కూటమి చైర్మన్ అభ్యర్థి శ్రీరామ్ చినబాబుకి బ్రహ్మరథం : 28వ వార్డులో జన ప్రభంజనం మధ్య ఎన్నికల ప్రచారం : పచ్చిపాల రామకృష్ణ ఆచారి,తులసి దంపతులు ఆత్మీయ స్వాగతం అశాంతిని అరికట్టేందుకు కొత్త నిబంధనలు ఉన్నప్పటికీ తిరానాలో చెలరేగిన నిరసనలు గిన్నిస్‌ ప్రపంచ రికార్డులతో గీతం పూర్వ విద్యార్థిని చరిత్ర వాసవి క్లబ్ సేవలు అభినందనీయం - ఉప్పల శ్రీనివాస్ గుప్తా అవకాశం ఇవ్వండి అభివృద్ధి చేసి చూపిస్తా.... 39 వ డివిజన్ జనసేన కార్పొరేటర్ అభ్యర్థి పింకీ జైన్ ఒక అవకాశం ఇస్తే 2వ వార్డు రూపురేఖలు మారుస్తా : టిడిపి కౌన్సిలర్ అభ్యర్థిని ఇడగొట్టి మల్లీశ్వరి హామీ ఇజ్రాయెల్ తదుపరి ప్రభుత్వంలో బెన్-గ్వీర్, స్మోట్రిచ్ ఉండకూడదు

హిందీ భాషా వ్యాప్తికి ప్రవాస భారతీయులు కృషి చేయాలి: ఆచార్య యార్లగడ్డ లక్ష్మీప్రసాద్

Select Suryaa Now
హిందీ భాషా వ్యాప్తికి ప్రవాస భారతీయులు కృషి చేయాలి: ఆచార్య యార్లగడ్డ లక్ష్మీప్రసాద్

విశాఖ ఎడ్యుకేషన్, సూర్య : విశ్వహిందీ పరిషత్ జాతీయ అధ్యక్షుడు, ప్రముఖ సాహితీవేత్త ఆచార్య యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ తన పది రోజుల హాంకాంగ్, చైనా పర్యటనలో భాగంగా హాంకాంగ్‌లోని తెలుగు, హిందీ సంఘాలు నిర్వహించిన పలు సాహిత్య, సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొన్నారు. భారతీయ భాషలు, సంస్కృతి, సంప్రదాయాల పరిరక్షణతో పాటు అంతర్జాతీయ స్థాయిలో హిందీ భాష వ్యాప్తికి ప్రవాస భారతీయులు మరింత చొరవ చూపాలని పిలుపునిచ్చారు.

హాంకాంగ్‌లోని హిందూ దేవాలయంలో నిర్వహించిన దసరా ఉత్సవాల్లో పాల్గొన్న యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ భారతీయ పండుగల ఆధ్యాత్మిక, సాంస్కృతిక విశిష్టతను వివరించారు. విదేశాల్లో నివసిస్తున్న భారతీయులు తమ మాతృభాషలను, సాంస్కృతిక మూలాలను మరచిపోకుండా భావితరాలకు అందించాలని సూచించారు. విజయదశమి వంటి పండుగలు భారతీయుల మధ్య ఐక్యతను, సాంస్కృతిక అనుబంధాన్ని పెంపొందిస్తాయని పేర్కొన్నారు. అనంతరం సాయంత్రం హాంకాంగ్‌లోని కరేబియన్ కోస్ట్ క్లబ్ హౌస్‌లో తెలుగు, హిందీ వాయిసెస్ ప్రతినిధులు ఏర్పాటు చేసిన సాహిత్య, సాంస్కృతిక కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు.

ప్రపంచవ్యాప్తంగా నివసిస్తున్న భారతీయులు తమ పిల్లలకు మాతృభాషతో పాటు హిందీ భాషను నేర్పించడం ద్వారా భారతదేశంతో సాంస్కృతిక సంబంధాలను మరింత బలోపేతం చేసుకోవచ్చని అభిప్రాయపడ్డారు. హిందీ, తెలుగు భాషల మధ్య సాహిత్య, సాంస్కృతిక పరస్పర సహకారాన్ని పెంపొందించుకోవాల్సిన అవసరాన్ని వివరించారు. ఈ పర్యటనలో భాగంగా హాంకాంగ్‌లోని భారత కాన్సులేట్‌లో నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో భారత కాన్సల్ జనరల్ శ్రీ రాజేష్ నాయక్ ఆచార్య యార్లగడ్డ లక్ష్మీప్రసాద్‌ను ఘనంగా సత్కరించారు. ఆయన గౌరవార్థం మధ్యాహ్న విందును ఏర్పాటు చేశారు.

ఈ సందర్భంగా హాంకాంగ్‌లో హిందీ భాషా ప్రచారం, అభివృద్ధికి చేపట్టాల్సిన కార్యక్రమాలపై యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ తన అభిప్రాయాలను వెల్లడించారు. స్థానిక భారతీయ సంఘాల సహకారంతో హిందీ భాషా తరగతులు, సాహిత్య సమావేశాలు, కవిసమ్మేళనాలు, సాంస్కృతిక ఉత్సవాలు, విద్యార్థులకు భాషా పోటీలు నిర్వహించడం ద్వారా హిందీపై ఆసక్తిని పెంపొందించవచ్చని సూచించారు. అలాగే డిజిటల్ మాధ్యమాలు, విద్యాసంస్థలు, సాంస్కృతిక సంస్థల సహకారంతో హిందీ భాషను అంతర్జాతీయ స్థాయిలో మరింత విస్తరించేందుకు అవకాశాలు ఉన్నాయని వివరించారు. హాంకాంగ్‌లోని తెలుగు, హిందీ సంఘాలు భారతీయ భాషా సాహిత్యాలను, సంప్రదాయాలను పరిరక్షించేందుకు చేస్తున్న కృషి అభినందనీయమని యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ పేర్కొన్నారు. భారతీయ భాషల వ్యాప్తికి ప్రవాస భారతీయులే సాంస్కృతిక రాయబారులుగా నిలవాలని ఆకాంక్షించారు.

రిపోర్టర్ : సత్యనారాయణ, ఏయూ, విశాఖపట్నం.