BREAKING
ఆరోగ్యకరమైన జీవనశైలి కోసం రోజూ తీసుకోవాల్సిన సమతుల్య ఆహారం ఏమిటి? శస్త్రచికిత్స తర్వాత మొదటిసారి బహిరంగంగా స్పందించిన పోప్ లీయో గుండె ఆరోగ్యాన్ని కాపాడుకోవడంలో చియా సీడ్స్, అవిసె గింజల్లో ఏది బెటర్? నిపుణుల సలహాలు! బ్రెజిల్ ఎన్నికల వేళ ఓటర్లను వేధిస్తున్న ప్రధాన సమస్యలు జవహర్ నగర్ డంపింగ్ యార్డు సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలి – ఎంపీ ఈటల రాజేందర్ డిమాండ్ జల్సా నివాసం వెలుపల అభిమానులను పలకరించిన అమితాబ్ బచ్చన్.. ఆరోగ్య రికవరీ వేళ భారీ భద్రత నడుమ సందడి! ప్రచార కార్యక్రమంలో స్పీడ్ పెంచిన 11వ టిడిపి కౌన్సిలర్ షాకిరా మౌలాలి కర్నూలు 13వ వార్డులో వైఎస్సార్‌సీపీ ఎన్నికల ప్రచారం చరిత్ర సృష్టించిన హర్మన్‌ప్రీత్ కౌర్.. మిథాలీ రాజ్ ఆల్‌టైమ్ రికార్డు బ్రేక్ టీమిండియా భవిష్యత్ స్టార్ తిలక్ వర్మ అద్భుత ప్రదర్శన.. యువ బ్యాటర్‌కు కోచ్ గాంబీర్ విలువైన సూచనలు! ఆశీర్వదించండి అభివృద్ధి చేస్తా.. 17వ డివిజన్‌లో జనసేన అభ్యర్థి భవాని రవికుమార్‌ విస్తృత ప్రచారం కర్నూలు 19వ వార్డు బుధవారపేటలో వైఎస్సార్‌సీపీ ఎన్నికల ప్రచారం నా అభిమానులను ఎప్పటికీ గర్వపడేలా చేస్తా.. కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ కుమార్ ఎమోషనల్! జనసేన పార్టీ నుండి వైఎస్సార్‌సీపీలోకి జనసేన ఆలమూరు మండల ఉపాధ్యక్షులు కొనగళ్ల ధనరాజు నాయుడు ఎంపిపి అభ్యర్థి వెంగయ్యకు శుభాకాంక్షలు తెలిపిన టిడిపినేత బడేనాయబ్ రసూల్:

జాబ్‌కార్డు ఉన్న ప్రతి ఒక్కరూ 125 రోజులు పని పొందాలి - జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా

Select Suryaa Now
జాబ్‌కార్డు ఉన్న ప్రతి ఒక్కరూ 125 రోజులు పని పొందాలి - జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా
సూర్య నిర్మల్ జిల్లా ప్రతినిధి: విబిజి రామ్ జీ పథకం ద్వారా జాబ్‌కార్డు కలిగిన ప్రతి ఒక్కరూ ఉపాధి పనులు పొందాలని జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా సూచించారు. పంటల దిగుబడి తగ్గడం, వ్యవసాయ రంగంలో ఉపాధి అవకాశాలు తగ్గే పరిస్థితుల్లో ఈ పథకం గ్రామీణ పేదలకు ఆర్థికంగా అండగా నిలుస్తుందని తెలిపారు.కడెం మండలం కొండుకూరు గ్రామంలోని ఎస్‌కే ఫంక్షన్‌ హాల్‌లో శనివారం నిర్వహించిన జోన్‌–1 స్థాయి విబిజి రామ్ జీ అవగాహన కార్యక్రమంలో కలెక్టర్ పాల్గొని మాట్లాడారు. ఎల్‌నినో ప్రభావంతో వ్యవసాయ రంగంపై ప్రతికూల ప్రభావం పడే అవకాశం ఉన్నందున, జాబ్‌కార్డు ఉన్న ప్రతి ఒక్కరూ 125 రోజుల పని దినాలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. పథకం కింద చేపట్టే పనులకు కూలీ డబ్బులు సకాలంలో చెల్లించేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు. గ్రామాల్లో నీటి సంరక్షణ, జలవనరుల అభివృద్ధి వంటి పనులను చేపట్టడం ద్వారా ఉపాధితో పాటు గ్రామీణ ప్రాంతాల్లో శాశ్వత ప్రయోజనాలు కలుగుతాయని పేర్కొన్నారు.ప్రజాప్రతినిధులు, అధికారులు గ్రామాల్లో విస్తృతంగా అవగాహన కల్పించి, అర్హులైన ప్రతి ఒక్కరూ ఉపాధి పనుల్లో పాల్గొనేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అవసరమైతే ప్రజల వద్దకే వెళ్లి ఉపాధి పనులపై అవగాహన కల్పించాలని సూచించారు.కార్యక్రమంలో డీఆర్‌డీఓ విజయలక్ష్మి, డీపీఓ శ్రీనివాస్, ఇంజినీరింగ్ అధికారులు సందీప్, తుకారాం, ఇతర శాఖల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.