గురువే సమాజ ప్రగతికి పునాది
కుకునూరుపల్లి, సమాజానికి ఉపాధ్యాయుడు దిక్సూచి ఈలాంటివారిని కొండపాక మార్కెట్ కమిటీ చైర్మన్ విరుపాక శ్రీనివాస్ రెడ్డి, పిఎన్ఆర్ స్వచ్ఛంద సంస్థ చైర్మన్ పోల్కంపల్లి నరేందర్,ఎంఈఓ బచ్చలి సత్తయ్య కుకునూరుపల్లి సర్పంచ్ మల్లం కనకవ్వ ఐలయ్య పేర్కొన్నారు. కుకునూరుపల్లి మండల వనరుల కేంద్రంలో మండలంలోని ప్రాథమిక, ఉన్నత పాఠశాలల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయులందరికీ సన్మాన కార్యక్రమం శనివారం సాయంత్రం నిర్వహించారు.ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ విద్యార్థులను అన్ని విధాలుగా తీర్చిదిద్ది భవిష్యత్తు గురువుది. గురువు లేని విద్య గమ్యం లేని ప్రయాణం వంటిదన్నారు. ఉపాధ్యాయుడు కేవలం పాఠాలు బోధించే వ్యక్తి మాత్రమే కాదని విద్యార్థులలో క్రమశిక్షణ, నైతిక విలువలు, ఆత్మవిశ్వాసం,దేశభక్తి వంటి గొప్ప లక్షణాలను పెంపొందించే మార్గదర్శి అన్నారు.విద్యార్థులకు పుస్తక జ్ఞానాన్ని అందించడంతోపాటు, సమాజానికి ఉపయోగపడే మంచి పౌరులుగా వారిని తీర్చిదిద్దడం ఉపాధ్యాయుల ప్రధాన కర్తవ్యమన్నారు.అదే సమయంలో విద్యార్థులు కూడా తమ గురువుల పట్ల గౌరవం కలిగి ఉండాలనితెలిపారు. ఉపాధ్యాయులు చెప్పే మంచి మాటలను ఆచరణలో పెట్టాలని,తల్లిదండ్రులను, గురువులను గౌరవిస్తూ, సమాజానికి సేవ చేసే వ్యక్తులుగా ఎదగాలని చూపించారు.
కార్యక్రమంలో ఫ్యాక్స్ వైస్ చైర్మన్ అమరేందర్, ముద్దాపూర్ సర్పంచ్ శ్రీకాంత్,అజీముద్దీన్, నరేష్ ,ఉప్పల రాజు, చిన్న కిష్టాపూర్ కాంప్లెక్స్ ప్రధాన ఉపాధ్యాయులు చెన్న శ్రీనివాస్, ఉన్నత పాఠశాలల ప్రధానోపాధ్యాయులు రమేష్, జానకిరామ్ రెడ్డి రాజిరెడ్డి,కొండి మల్లారెడ్డి శ్రీనివాస్ రెడ్డి తదితరులు మాట్లాడారు అనంతరం ఉపాధ్యాయులందరికీ సన్మాన కార్యక్రమం నిర్వహించారు.