విద్యార్థులు మాదాకద్రవ్యాలకు దూరంగా ఉండాలి
సూర్య- బిక్కనూర్ : విద్యార్థులు మాదాకద్రవ్యాలకు దూరంగా ఉండాలని,విజన్ స్వచ్ఛంద సంస్థ జిల్లా సమన్వయకర్త శరత్ కుమార్ ,సిబ్బంది సంగీత, మంజుల సూచించారు. శనివారం మండల కేంద్రంలోని స్థానిక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు మదకద్రవ్యాల నిర్మూలనపై అవగాహన సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విద్యార్థుల బంగారు భవిష్యత్తుకు మాదకద్రవ్యాలు అడ్డంకిగా మారకుండా చూసుకోవాలని, మాదకద్రవ్యాల వినియోగం వల్ల కలిగే ఆరోగ్య, మానసిక, సామాజిక నష్టాలను వివరించారు. చిన్న వయస్సులోనే చెడు అలవాట్లకు దూరంగా ఉంటూ, మంచి ఆలోచనలు, క్రమశిక్షణ, ఆత్మవిశ్వాసంతో జీవితంలో ఉన్నత లక్ష్యాలను సాధించాలని సూచించారు. డ్రగ్స్‌కు బానిస కావడం వల్ల వ్యక్తి భవిష్యత్తుతో పాటు కుటుంబం కూడా అనేక ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తుందని తెలిపారు.ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధాన ఉపాధ్యాయురాలు రేఖ, విజన్ స్వచ్ఛంద సంస్థ సిబ్బంది పాఠశాల సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.