ఎన్నికల స్ట్రాంగ్ రూమ్, కౌంటింగ్ సెంటర్ ను తనిఖీ చేసిన ఎన్నికల జనరల్ అబ్జర్వర్
పాలకొండ, సూర్య : మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో, పాలకొండ సబ్ కలెక్టర్ స్వప్నిల్ పవార్, ఎన్నికల జనరల్ అబ్జర్వర్ యస్. చిన రాముడు తో కలిసి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఏర్పాటు చేసిన మున్సిపల్ ఎన్నికల స్ట్రాంగ్ రూమ్ మరియు కౌంటింగ్ సెంటర్‌ను శనివారం తనిఖీ చేశారు.ఈ సందర్భంగా స్ట్రాంగ్ రూమ్ భద్రతా ఏర్పాట్లు, కౌంటింగ్ కేంద్రంలో అవసరమైన మౌలిక సదుపాయాలు, సీసీ కెమెరాల ఏర్పాటు, విద్యుత్, తాగునీరు, పారిశుద్ధ్యం తదితర ఏర్పాట్లను పరిశీలించారు. ఎన్నికల ప్రక్రియ సజావుగా, పారదర్శకంగా నిర్వహించేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లను ముందుగానే పూర్తి చేయాలని మున్సిపల్ అధికారులకు సూచించారు.అలాగే స్ట్రాంగ్ రూమ్ మరియు కౌంటింగ్ సెంటర్ వద్ద భద్రతా ప్రమాణాలను కచ్చితంగా పాటించాలని, ఎన్నికల కమిషన్ మార్గదర్శకాలకు అనుగుణంగా ఏర్పాట్లు పూర్తి చేయాలని అధికారులకు ఆదేశించారు.ఈ కార్యక్రమం లో నగర పంచాయతీ కమిషనర్ పీవీ నూకరాజు, సిబ్బంది పాల్గొన్నారు.
రిపోర్టర్ : రమణ మూర్తి నాయుడు, పాలకొండ, పార్వతీపురం మన్యం.