BREAKING
కే-రిడ్జ్ స్కూల్‌లో ఎన్‌సీసీకి 25 మంది విద్యార్థుల ఎంపిక క్రిస్ట్‌చర్చ్‌లో తిలక్ వర్మ అద్భుత బ్యాటింగ్ విన్యాసం: ఎటాక్ చేయాల్సిన సమయంపై మాస్టర్ క్లాస్ ఎన్నికలకు స్వేచ్ఛగా జరిగేందుకు అందరూ సహకరించండి ఎస్ఐ మల్లికార్జున రావు ఎంపీ శ్రీకృష్ణదేవరాయలుతో ఆర్యవైశ్య ప్రముఖుల ఆత్మీయ భేటీ 28న జిల్లా స్థాయి రోల్‌ప్లే, జానపద నృత్య పోటీలు ఏయూ పూర్వ విద్యార్థుల స్పంద‌న అపూర్వం 10 వార్డు టిడిపి కౌన్సిలర్ అభ్యర్థి షేక్ షరీఫున్ ఇంటింటా ప్రచారం స్కేటింగ్, చెస్ పోటీలలో భాష్యం ప్రతిభ ఒక అవకాశం ఇవ్వండి వార్డును అభివృద్ధి చేసి చూపిస్తా... * 48 వ వార్డు స్వతంత్ర అభ్యర్థి కోయిలాడ సూర్యకళ (నవ్య) * క్రాస్ కంట్రీలో వాగ్దేవి విద్యార్థుల సత్తా ప్రభుత్వ భూముల్లో అక్రమ నిర్మాణాలను కూల్చివేతలు- తహసీల్దార్ చంద్రశేఖర్ రెడ్డి గ్రామాల వారీగా అభివృద్ధి పై సమీక్ష నిర్వహించిన మంత్రి హిందీ భాషా వ్యాప్తికి ప్రవాస భారతీయులు కృషి చేయాలి: ఆచార్య యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ పీఎం రాహత్ పథకాన్ని పకడ్బందీగా అమలు చేయాలి జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ అప్పాజీపల్లిలో ప్రోటోకాల్‌ ఉల్లంఘనపై గ్రామ పాలకవర్గం ఆగ్రహం

పరిషత్తు పోరు"నామినేషన్" సక్రమం...ఇక అసలైన సమరం!

Select Suryaa Now
పరిషత్తు పోరు"నామినేషన్" సక్రమం...ఇక అసలైన సమరం!

గరుగుబిల్లి, సూర్య : ఎన్నికల ప్రస్థానంలో అభ్యర్థుల భవితవ్యాన్ని తేల్చే అత్యంత కీలక మైన ఘట్టం నామినేషన్ల పరిశీలన..ఈ నేపథ్యంలో నామినేషన్ల పరిశీలన (స్క్రూటినీ)కార్యక్రమంను శనివారం మండల పరిషత్తు అభివృద్ధి కార్యాల యంలో అభ్యర్థుల సమక్షంలో పరిషత్ పోరులో కీలక ఘట్టమైన ఎంపీటీసీ నామినేషన్ల పరిశీలన ప్రక్రియను మండల ఎన్నికల అధికారి పూర్తి చేయడం జరిగింది.ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థి సమర్పించిన పత్రాలు చట్టబ ద్ధంగా ఉన్నాయా? ఎన్నికల సంఘం నిబంధనల ప్రకారం అర్హతలు ఉన్నా యా లేదా? అని ఎన్నికల అధికారులు క్షుణ్ణంగా పరిశీలించారు.ప్రధాన పార్టీ లైన టీడీపీ, వైఎస్సార్‌ సీపీ, జనసేన, బీజేపీలతో పాటు స్వతంత్ర అభ్యర్థులు ఎన్నికల్లో పోటీ చేసేందుకు నామినేషన్ పత్రాలను సమర్పించారు.ఈమేరకు మండల పరిషత్ అభివృద్ధి కార్యాల యంలో ఎన్నికల అధికారి శనివారం నామినేషన్ల పరిశీలన కార్యక్రమం చేపట్టారు.తెలుగుదేశం పార్టీ తరపున 30 మంది అభ్యర్థులు, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫున 25 మంది అభ్యర్థులు,జనసేన పార్టీ తరఫున 8 మంది, బిజెపి తరఫున ఇద్దరు అభ్యర్థు లు,ఇండిపెండెంట్ అభ్యర్థులుగా ఇరు వురు నామినేషన్లు దాఖలు చేయడం జరిగిందని ఎన్నికల అధికారి ఎం వాణి శైలజ తెలిపారు.ఈమేరకు మొత్తం నామినేషన్లను సంబంధిత అభ్యర్థుల సమక్షంలో పరిశీలన చేయడం జరిగిం దన్నారు.మండలానికి సంబంధించి ఒక నామి నేషన్ తిరస్కరణ కాలేదని పేర్కొన్నారు.అదే విధంగా 27వ తేదీ సాయంకాలం ఎంపీటీసీ పదవులకు పోటీ చేయు అభ్యర్థుల పేర్లు నోటీసు బోర్డులో ప్రకటన చేయడం జరుగు తుందని ఎన్నికల అధికారి ఎం వాణి శైలజ తెలిపారు.ఈకార్యక్రమంలో ఉప ఎన్నికల అధికారులు నడిమింటి సూర్యనారాయణ,పాము బాల, కార్యాలయ ఏవో నాలి అర్జునరావు, అభ్యర్థులు మరడాన నారాయణ స్వామినాయుడు,మర్రాపు పురుషోత్తం నాయుడు,అంబటి తవిటినాయుడు (రాంబాబు), ద్వారపురెడ్డి విమల, కేతిరెడ్డి శిరీష, మండల భాగ్యలక్ష్మి, అంబటి గౌరునాయుడు తదితరులు పాల్గొన్నారు.

రిపోర్టర్ : శశి భూషణరావు, గరుగుబిల్లి, పార్వతిపురం మన్యం.