BREAKING
జోరుగా ఆరు పిక్కల జూదం!. - * ‘సింగిల్ మాది.. డబుల్ మీది’ పేరుతో దందా * అనాథ వృద్ధులకు బాలవికాస అండ 40 మంది వృద్ధులకు నిత్యావసర సరుకులు, సమస్యాత్మక గ్రామాలు గుర్తించి అధికారులు అప్రమత్తంగా ఉండాలి తిరుపతిలో టీడీపీకి తిరుగులేదు జేబీ శ్రీనివాస్‌కు కమ్మ సంఘం మద్దతు 66 డివిజన్లలో టీడీపీ జెండా ఎగరడం ఖాయం విద్యార్థి హక్కుల పోరాటానికి బీఆర్ఎస్వీ బలోపేతం -బండచర్లపల్లి,రావురూకులలో నూతన విద్యార్థి కమిటీల ఏర్పాటు నటి ఇంద్రజ చేతుల మీదుగా ‘జుఒన్‌’ సూపర్‌ యాప్‌ ఆవిష్కరణ.. ఒకే వేదికపై 25 రకాల సేవలు! ఎన్నికల ప్రవర్తన నియమావళి ఉల్లంఘిస్తే చర్యలు తప్పవు మృత కార్మికుల కుటుంబాలకు యూనియన్ అండ.. -రూ.20 వేల సాయం! తుఫాను నేపథ్యంలో రైతులు అప్రమత్తత అవసరం * సూచనలు అందజేసిన మండల ఏవో మెట్ట మోహనరావు * అభివృద్ధి, సంక్షేమమే ప్రచార అస్త్రాలుగా ముందుకు సాగుదాం ... ఏకగ్రీవ ఎన్నిక ధ్రువపత్రం అందుకున్న సురేష్ నాయుడు స్థానిక సంస్థల జోరు.. రెబల్స్ తో పోరు సైకిల్ గుర్తుకే ఓటు వేయండి.. జడ్పిటిసి అభ్యర్థి శిరీష హడ్కో కాలనీలో వైఎస్సార్‌సీపీ ప్రచార జోరు ఎన్నికలు ఏర్పాట్లను పరిశీలించిన అధికారులు

ఎస్సై, కానిస్టేబుల్ అభ్యర్థులకు ఉచిత కోచింగ్ ప్రారంభించిన ఎస్పీ

Select Suryaa Now
ఎస్సై, కానిస్టేబుల్ అభ్యర్థులకు ఉచిత కోచింగ్ ప్రారంభించిన ఎస్పీ

*నారాయణపేట, సూర్యన్యూస్* :   జిల్లాలో పేద, ప్రతిభావంతులైన యువత పోలీస్ ఉద్యోగాలు సాధించాలనే లక్ష్యానికి ఆర్థిక పరిస్థితులు అడ్డంకి కాకూడదనే ఉద్దేశంతో నారాయణపేట జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ఎస్సై, కానిస్టేబుల్ ఉచిత శిక్షణ కార్యక్రమాన్ని జిల్లాలో ప్రారంభించినట్లు ఎస్పీ డాక్టర్ వినీత్ తెలిపారు. జిల్లా కేంద్రంలోని లయన్స్ క్లబ్‌లో శనివారం నిర్వహించిన కార్యక్రమంలో ఆయన శిక్షణ తరగతులను ప్రారంభించారు. పోలీస్ ఉద్యోగాల కోసం నిర్వహించిన అర్హత పరీక్షకు మొత్తం 413 మంది అభ్యర్థులు హాజరుకాగా, వారిలో ప్రతిభ ఆధారంగా 130 మంది మెరిట్ అభ్యర్థులను ఎంపిక చేసి ఉచిత శిక్షణ అందించేందుకు ఏర్పాట్లు చేసినట్లు ఎస్పీ వెల్లడించారు.

*ఉచిత వసతి, అనుభవజ్ఞులైన ఫ్యాకల్టీ*
ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ... ఎంపికైన అభ్యర్థులకు ఉచిత వసతి, అనుభవజ్ఞులైన ఫ్యాకల్టీ ద్వారా నాణ్యమైన బోధన, అవసరమైన స్టడీ మెటీరియల్‌తో పాటు శారీరక దారుఢ్యాన్ని పెంపొందించేందుకు ఫిజికల్ ఫిట్‌నెస్ శిక్షణ అందించనున్నట్లు తెలిపారు.  గ్రామీణ ప్రాంతాల్లోని ఎంతోమంది యువతకు పోలీస్ ఉద్యోగాలు సాధించాలనే పట్టుదల, ప్రతిభ ఉన్నప్పటికీ ప్రైవేట్ కోచింగ్ తీసుకునే ఆర్థిక స్థోమత లేక ఇబ్బందులు ఎదురవుతున్నాయని పేర్కొన్నారు. అలాంటి యువతకు సమాన అవకాశాలు కల్పించి, వారి ప్రతిభను వెలికితీసి, ప్రభుత్వ ఉద్యోగాల సాధనలో అండగా నిలవాలనే లక్ష్యంతో జిల్లా పోలీస్ శాఖ ఈ కార్యక్రమాన్ని చేపట్టిందని తెలిపారు.

*క్రమశిక్షణతో చదువి ఉద్యోగాన్ని సాధించాలి*
యువతకు సరైన మార్గదర్శకత్వం, నాణ్యమైన శిక్షణ అందిస్తే వారు ఉన్నత లక్ష్యాలను సాధించగలరని ఎస్పీ పేర్కొన్నారు. అభ్యర్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని, క్రమశిక్షణతో చదువుతూ ఉద్యోగ సాధనే ధ్యేయంగా ముందుకు సాగాలని సూచించారు. తరగతులకు క్రమం తప్పకుండా హాజరవుతూ, ప్రతిరోజూ నేర్చుకున్న అంశాలను పునశ్చరణ చేసుకోవాలని, మాక్ టెస్టుల ద్వారా తమ సామర్థ్యాన్ని మెరుగుపరుచుకోవాలని తెలిపారు. రాత పరీక్షతో పాటు శారీరక దారుఢ్యానికి కూడా సమాన ప్రాధాన్యత ఇవ్వాలని, ఫిజికల్ ఈవెంట్లలో అర్హత సాధించేందుకు నిరంతరం సాధన చేయాలని సూచించారు. పోలీస్ శాఖ కల్పిస్తున్న ఉచిత వసతి, బోధన, స్టడీ మెటీరియల్, ఫిట్‌నెస్ శిక్షణ వంటి సదుపాయాలను పూర్తిస్థాయిలో వినియోగించుకోవాలని కోరారు.

*నిబంధనలు పాటించని అభ్యర్థులపై తగిన చర్యలు* 
శిక్షణ సమయంలో క్రమశిక్షణ, సమయపాలన అత్యంత ముఖ్యమని ఎస్పీ స్పష్టం చేశారు. శిక్షణ పట్ల నిర్లక్ష్యం, క్రమశిక్షణా ఉల్లంఘనలను సహించబోమని, నిబంధనలు పాటించని అభ్యర్థులపై తగిన చర్యలు తీసుకోవడంతో పాటు శిక్షణ నుంచి తొలగించే అవకాశం ఉంటుందని హెచ్చరించారు. ప్రతి అభ్యర్థి బాధ్యతాయుతంగా వ్యవహరిస్తూ, పూర్తి నిబద్ధతతో శిక్షణ పొందాలని సూచించారు. ప్రజలకు సేవ చేయాలనే సంకల్పంతో పోలీస్ శాఖలో చేరాలనుకునే యువతకు ఈ శిక్షణ కార్యక్రమం ఒక మంచి అవకాశమని ఎస్పీ తెలిపారు. కష్టపడే తత్వం, పట్టుదల, క్రమశిక్షణ, నిరంతర సాధనతో లక్ష్యాన్ని సాధించవచ్చని పేర్కొన్నారు.

*తల్లిదండ్రులు, జిల్లాకు మంచి పేరు తేవాలి*
ఎంపికైన అభ్యర్థులందరూ తమ తల్లిదండ్రుల ఆశయాలను నెరవేర్చడంతో పాటు నారాయణపేట జిల్లాకు మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు.
ప్రతిభావంతులైన యువతకు ప్రోత్సాహం అందించడం, వారికి సరైన దిశానిర్దేశం చేయడం, పోలీస్ నియామకాల్లో విజయవంతమయ్యేలా తీర్చిదిద్దడం ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశమని ఎస్పీ తెలిపారు. ఎంపికైన అభ్యర్థులకు శుభాకాంక్షలు తెలియజేస్తూ, వారి ఉద్యోగ సాధనకు జిల్లా పోలీస్ శాఖ తనవంతు సహకారం అందిస్తుందని భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో డీఎస్పీలు మహేష్, నల్లపు లింగయ్య, కాజల్, సీఐలు శివ శంకర్, రామ్ లాల్, భగవంత్ రెడ్డి, సైదులు, ఎస్‌ఐలు వెంకటేశ్వర్లు, సతీష్ రెడ్డి, నరేష్, భాగ్యరెడ్డి, అభ్యర్థులు పాల్గొన్నారు.
-- రాజేష్ కుమార్, సూర్య రిపోర్టర్, నారాయణపేట.