స్వర్ణకారుల కు ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేయాలి - నాగర్ కర్నూల్ నుండి శంఖరావానికి తరలిన స్వర్ణకారులు
నాగర్ కర్నూల్ క్రైమ్, సూర్య న్యూస్: స్వర్ణకారుల సమస్యలు పరిష్కరించడంతోపాటు ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని నాగర్ కర్నూల్ జిల్లా స్వర్ణకార సంఘం ప్రధాన కార్యదర్శి కొండోజు రవీంద్ర చారి డిమాండ్ చేశారు. హైదరాబాద్ సరూర్ నగర్ లోని మైదానంలో నిర్వహించే స్వర్ణకార శంఖారావం భారీ బహిరంగ సభకు శనివారం నాగర్ కర్నూల్ స్వర్ణకారులు. తరలి వెళ్లారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ న్యాయపరమైన డిమాండ్లు స్వర్ణకారులకు ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేయాలి దాంతోపాటు పాలకమండలి నియమించాలని వారు డిమాండ్ చేశారు. జీవో నెంబర్ 272 సవరణ చేసి అమలు పరిచి అక్రమ రికవరీల ను అరికట్టాలన్నారు. 50 సంవత్సరాలు పైబడిన స్వర్ణకార వృత్తి దారులకు 5000 రూపాయల పెన్షన్ అమలు చేయాలని డిమాండ్ చేశారు .అదేవిధంగా అన్ని బ్యాంకులలో అప్రైజర్లకు సీలింగ్ విధానం తొలగించి సమాంతర కమిషన్ ఇవ్వాలని న్యాయ పరమైన డిమాండ్ల సాధనకు హైదరాబాదులో నిర్వహించే భారీ బహిరంగ సభకు బయలుదేరి వెళ్లారు. కార్యక్రమంలో నాగర్ కర్నూల్ మున్సిపల్ కౌన్సిలర్లు జయలక్ష్మి నగేష్ చారి, జయప్రకాష్ చారి , పట్టణ స్వర్ణకార సంఘం అధ్యక్షులు ప్రతాప్ చారి, విష్ణుచారి, వేణు చారి, రాజు చారి, మూర్తి చారి, కేశవాచారి స్వర్ణకారసభ్యులు తదితరుల ఆధ్వర్యంలో స్వర్ణకారులు భారీగా తరలి వెళ్లారు.