53వ డివిజన్ ప్రచారంలో జోరుగా దూసుకుపోతున్న శంకర్ యాదవ్
తిరుపతి ,రెవెన్యూ ,మేజర్ న్యూస్.
ప్రసారంలో దూసుకుపోతున్న శంకర్ యాదవ్..
53వ డివిజన్‌లో జోరుగా ఇంటింటి ఎన్నికల ప్రచారం
తిరుపతి నగరపాలక సంస్థ ఎన్నికల ప్రచారం రోజురోజుకు ఊపందుకుంటోంది. 53వ డివిజన్‌లో తెలుగుదేశం పార్టీ కార్పొరేటర్ అభ్యర్థి శంకర్ యాదవ్ ప్రచారంలో దూసుకుపోతూ ఓటర్లను ఆకట్టుకుంటున్నారు. ప్రచారానికి శ్రీకారం చుట్టిన శంకర్ యాదవ్ ముందుగా డివిజన్‌లోని సీనియర్ తెలుగుదేశం పార్టీ నాయకులను మర్యాదపూర్వకంగా కలిసి వారి ఆశీర్వాదాలు, మద్దతు పొందారు. అనంతరం కూటమిలోని జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలతో కలిసి ఇంటింటికీ తిరుగుతూ ప్రజలను కలుస్తున్నారు. ఈ సందర్భంగా డివిజన్ ప్రజల సమస్యలను తెలుసుకుంటూ, ఎన్నికల్లో విజయం సాధిస్తే అభివృద్ధికి పెద్దపీట వేస్తానని హామీ ఇచ్చారు. మాటలు చెప్పే నాయకుడిని కాదని, చేతల్లో చూపించే ప్రజాప్రతినిధిగా పని చేస్తానని పేర్కొన్నారు. ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ ప్రతి సమస్య పరిష్కారానికి కృషి చేస్తానని తెలిపారు. రానున్న ఎన్నికల్లో మేయర్ అభ్యర్థి జేబీ శ్రీనివాసులకు కార్పొరేటర్ అభ్యర్థిగా తనకు సైకిల్ గుర్తుపై ఓటు వేసి భారీ మెజారిటీతో తనను గెలిపించాలని శంకర్ యాదవ్ డివిజన్ ప్రజలను కోరారు. ప్రచార కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేశారు.
కె రాజేష్ రిపోర్టర్ తిరుపతి