telangana
సాయిపూర్‌లో ఆంజనేయ స్వామి ఉత్సవం అంగరంగ వైభవం
తాండూరు, మేజర్ న్యూస్ :తాండూరు మున్సిపల్ పరిధిలోని సాయిపూర్ గ్రామంలో శ్రీ ప్రసన్న అభయ ఆంజనేయ స్వామి ఉత్సవాలు శనివారం భక్తిశ్రద్ధలతో, అంగరంగ వైభవంగా జరిగాయి. ఈ వేడుకలకు తాండూరు మున్సిపల్ చైర్‌పర్సన్ నీరజ బాల్‌రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. గ్రామ పెద్దల ఆధ్వర్యంలో నిర్వహించిన పూజలు, స్వామివారి ఊరేగింపు భక్తులను ఆకట్టుకున్నాయి. ఉత్సవాల సందర్భంగా పెద్ద ఎత్తున అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి భక్తులకు అన్నప్రసాదం అందజేశారు. భక్తుల సందడి, ఆధ్యాత్మిక శోభతో సాయిపూర్ గ్రామం పండుగ వాతావరణాన్ని సంతరించుకుంది. భక్తి, ఐక్యత, సేవాభావానికి ప్రతీకగా నిలిచిన ఈ ఉత్సవాల్లో గ్రామస్తులు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో తాండూరు మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ బాల్‌రెడ్డి, గ్రామ పెద్దలు, స్థానికులు తదితరులు పాల్గొన్నారు.