ప్రశాంతంగా ముగిసిన నామినేషన్ల పరిశీలన
వింజమూరు మేజర్ న్యూస్ : వింజమూరు మండలంలో ఉన్న 12 ఎంపీటీసీ స్థానాలకు గత మూడు రోజులుగాజరిగిన నామినేషన్లు 106దాఖలు కాగా ఆ నామినేషన్లలనుశనివారం పరిశీలించారు అభ్యర్థులు పరిశీలకుల సమక్షంలో జరిగిన ఈ కార్యక్రమంలో 72 మంది నామినేషన్లు ఖచ్చితమైనవుగా నిర్ధారించినట్లు ఆర్వో ఎం శేషగిరిరావు తెలిపారు ఏ ఒక్క నామినేషన్ కూడా తిరస్కరణకు గురి కాలేదని తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వీరిలో ఎవరైనా ఉపసంహరణ చేసుకోవాలని ఆలోచన ఉంటే నేటినుండి 27వ తేదీ మధ్యాహ్నంలోపు తమ ఉపసంహరణ పత్రాన్ని నేరుగా ఆర్వోకు అభ్యర్థి మాత్రమే అందజేయాల్సిందని తెలిపారు గుర్తింపు పొందిన రాజకీయ పార్టీలు తమ అభ్యర్థుల బీ ఫారం లను అందజేయాలని తెలిపారు పోటీలో నిలిచిన పార్టీలు బిజెపి ఇద్దరూ కాంగ్రెస్ ఒకటి జనసేన రెండు తెలుగుదేశం 33 వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 32 స్వతంత్ర అభ్యర్థులు ఇద్దరు ప్రస్తుతం నామినేషన్లను వాస్తవ పరిచినట్లు తెలిపారు ఈ కార్యక్రమంలో ఎంపీడీవో కే శ్రీనివాసరెడ్డి ఉన్నారు.