డిజిపి ని తోలుబొమ్మ తో పోల్చిన జగన్ ని అరెస్ట్ చేయాలి - కాపు పొలిటికల్ జేఏసీ చైర్మన్ వేల్పురి
భట్టిప్రోలు, మేజర్ న్యూస్:
డీజీపీని తోలుబొమ్మతో పోల్చిన మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని అరెస్టు చేయాలని కాపు పొలిటికల్ జేఏసీ ఆంధ్ర ప్రదేశ్ తెలంగాణ చైర్మన్ వేల్పురి శ్రీనివాసరావు డిమాండ్ చేశారు. శనివారం భట్టిప్రోలు విలేకరులతో ఆయన మాట్లాడుతూ
36 అవినీతి, అక్రమాలు కేసుల్లో ముద్దాయి గా ఉన్న, దేశ ఆర్థిక ఉగ్రవాది అని పేరు పొందిన పులివెందుల శాసనసభ్యుడు వైయస్ జగన్ ఆంద్రప్రదేశ్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీసు హరీష్ కుమార్ గుప్తా ను తోలుబొమ్మ అని పోలీసు వ్యవస్థ ను అవమానం చేశార ని, అందువల్ల జగన్ బెయిల్ రద్దు చేసి అరెస్ట్ చేయాలని, అప్పుడే రాష్ట్రం లో శాంతిభద్రతలు అదుపులో ఉంటాయన్నారు. అని కాపు ఉద్యమ నేత వేల్పురి శ్రీనివాసరావు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు బహిరంగ లేక వ్రాసినట్లు తెలిపారు. గతంలో అనేకసార్లు పోలీసు అధికారులు ను బట్టలు విప్పి కొడతా నని హెచ్చరించారని, 2003 లో జగన్ తండ్రి వైయస్ రాజశేఖర రెడ్డి కూడా పోలీసులు నా కాళ్ళు కింద చెప్పులు లాంటి వారని అవమానం చేశారని శ్రీనివాసరావు గుర్తు చేశారు. జగన్ అధికారంలోకి వచ్చిన వెంటనే నిబంధనలు కు వ్యతిరేకంగా 14 వ స్థానం లో ఉన్న రాజేంద్రనాధ రెడ్డి ని డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీసు గా నియమించుకుని, రాష్ట్రం లో అరాచక పాలన చేశారని లేఖలో వివరించారు. రాష్ట్రంలో ఎన్నికల కమిషనర్ అనిల్ చంద్ర పునీత ని కరుడు కట్టిన తీవ్రవాది అని అవమానం చేసినా, డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీసు ను తోలు బొమ్మ అని కించపరిచినా ఐఏఎస్, ఐపిఎస్ అధికారుల సంఘాలు మౌనంగా ఉండడం సిగ్గు చేటు అని శ్రీనివాసరావు పేర్కొన్నారు. రాష్ట్రంలో అరాచకవాది గా పేరొందిన జగన్ ని యువత ఆదర్శంగా తీసుకుంటే రాష్ట్రం సర్వ నాశనం అవుతుందని, అందువల్ల జగన్ ని వెంటనే అరెస్ట్ చేసి శాంతి భద్రతల కాపాడాలని, చట్టం అందరికీ సమానం అన్న విషయం రాష్ట్ర ప్రభుత్వం గుర్తు పెట్టుకోవాలని శ్రీనివాసరావు సూచించారు. రాష్ట్ర అభివృద్ధి కోసం, కాపునాడు పెద్దన్న పాత్ర పోషిస్తున్నదని శ్రీనివాసరావుతెలిపారు.