ఆసుపత్రి బిల్లులపై బీఐఎస్ ప్రమాణాలు తప్పనిసరి చేయాలి.. క్యాప్కో చైర్మన్ జి. సురేష్ కుమార్ డిమాండ్
అనంతపురం మేజర్ న్యూస్ ప్రతినిధి :- ఆసుపత్రి బిల్లుల్లో పారదర్శకత కోసం బీఐఎస్ ప్రమాణాలను కేంద్ర ప్రభుత్వం తప్పనిసరి చేయాలని క్యాప్కో చైర్మన్ జి. సురేష్ కుమార్ డిమాండ్ చేశారు.
2025లో రూపొందించిన ఐఎస్ 19493:2025 ప్రమాణాల ప్రకారం గది అద్దె, వైద్యుల రుసుములు, మందులు, పరీక్షలు, శస్త్రచికిత్సల ఖర్చులను బిల్లుల్లో విడివిడిగా చూపించాలని కోరారు.
ఆసుపత్రులు, క్లినిక్‌లు, వైద్య పరీక్షా కేంద్రాల్లో సేవల ధరలను స్పష్టంగా ప్రదర్శించాలని సూచించారు. అధిక బిల్లులు, అనవసర ఛార్జీలపై ఫిర్యాదు చేసేందుకు సులభమైన వ్యవస్థను ఏర్పాటు చేయాలన్నారు.
రోగుల ఫిర్యాదుల పరిష్కారానికి ఐఎస్ 16677 ప్రమాణాన్ని అమలు చేసే అంశాన్ని పరిశీలించాలని కోరారు. నిబంధనలు ఉల్లంఘించే ఆసుపత్రులపై చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేశారు. వైద్య ఖర్చులపై పారదర్శకతతోనే వినియోగదారుల హక్కులను కాపాడగలమని సురేష్ కుమార్ పేర్కొన్నారు.
మల్లికార్జున నేటి దినపత్రిక సూర్య స్టాఫ్ రిపోర్టర్..