భట్టిప్రోలు మండల ప్రజా పరిషత్ నామినేషన్ లు 61 చెల్లుబాటు అయ్యాయి
భట్టిప్రోలు, మేజర్ న్యూస్: భట్టిప్రోలు మండల పరిధిలో 14 ఎంపీటీసీ స్థానాలకు 70 మంది నామినేషన్లు దాఖలు చేయగా అందులో 61 మంది అభ్యర్థుల నామినేషన్ దరఖాస్తులు చెల్లుబాటు అయినట్లు ఎన్నికల రిటర్నింగ్ అధికారి యన్ దేవలక్ష్మి శనివారం తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ 9 మంది అభ్యర్థుల నామినేషన్లు చెల్లుబాటు కాలేదన్నారు. భట్టిప్రోలు ఒకటవ ప్రాదేశిక నియోజకవర్గం నుండి తెలుగుదేశం పార్టీకి చెందిన ఇరువురు వైయస్సార్సీపీకి చెందిన ఇరువురు, రెండవ ప్రాదేశిక నియోజకవర్గం కు 5 గురు, మూడవ సెగ్మెంట్ నుండి ఐదుగురు, నాలుగవ సెగ్మెంట్ నుండి నలుగురు నిలిచారన్నారు. వెల్లటూరు ఒకటవ సెగ్మెంటు నలుగురు, రెండవ సెగ్మెంటు కు నలుగురు, ఐలవరం ఐదుగురు, ఓలేరు ఐదుగురు, కోనేటిపురం నలుగురు, గొరిగ పూడి ఆరుగురు, చింతమోటు నలుగురు, పల్లికోన నలుగురు, పెదపులివర్రు ముగ్గురు, సూరేపల్లి నలుగురు నామినేషనలో పరిశీలనలో నెగ్గినట్లు ఎన్నికల అధికారి దేవలక్ష్మి పేర్కొన్నారు. ఈ సమావేశంలో భట్టిప్రోలు ఎంపీడీవో ఎస్ వెంకటరమణ, తహసిల్దారు జి నాగరాజు తదితరులున్నారు.