13 ఎంపీటీసీ స్థానాలకు 73 నామినేషన్లు
ఆమదాలవలస, సూర్య : ఆమదాలవలస మండలంలో 13 ఎంపీటీసీ స్థానాలకు వివిధ పార్టీల నుంచి 73 మంది అభ్యర్థులు నామినేషన్లు వేశారు. చీమలవలస నుంచి 5, దూసి 8, మునగవలస 5, కలివరం 5, కనుగులవలస 5, కట్యాచార్యుల పేట 5, కొల్లివలస 5, కొర్లకోట 5, నెల్లిపర్తి 6, నిమ్మతొర్లాడ 6, రామచంద్రాపురం 6, శ్రీనివాసచార్యుల పేట 5, తోటడా 7 మంది అభ్యర్థులు నామినేషన్లు అందజేశారు. వీరందరి నామినేషన్లు శనివారం అధికారుల సమక్షంలో పరిశీలన చేశారు. ప్రధాన పార్టీల నుంచి అభ్యర్థులు బరిలో నిలవడంతో గెలుపుపై ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. గ్రామాల్లో ప్రధాన పార్టీల అభ్యర్థులు గట్టి పోటీ కావడంతో ఎన్నికల ప్రచారంలో చురుగ్గా పాల్గొంటున్నారు. మరోవైపు వలస ఓటర్ల పై ప్రత్యేక దృష్టి సారిస్తున్నారు. గెలుపే లక్ష్యంగా ప్రధాన పార్టీలు ఉన్నందున వలస ఓటర్లను ఆకర్షించేందుకు వివిధ ప్రాంతాలకు పయనమవుతున్నారు. ఓటర్ల చేతిలో అభ్యర్థుల భవితవ్యం ఉండడంతో ప్రత్యేక పలకరింపులు, గుర్తింపు ఇస్తూ ముందుకు సాగుతున్నారు. ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ప్రధాన పార్టీల అభ్యర్థులు ఉండడంతో గ్రామాల్లో ఎన్నికల వేడి మొదలైంది.
రిపోర్టర్ : రాము, సరుబుజ్జి, ఆమదాలవలస, శ్రీకాకుళం జిల్లా.