BREAKING
ఆసుపత్రి బిల్లులపై బీఐఎస్ ప్రమాణాలు తప్పనిసరి చేయాలి.. క్యాప్కో చైర్మన్ జి. సురేష్ కుమార్ డిమాండ్ 15, 16, 17 వార్డులలో తెదేపా ఎన్నికల ప్రచారం. మద్దతు తెలిపిన 20 కుటుంబాలు. కెమికల్స్ అండ్ పెట్రోకెమికల్స్ రంగం భారీ లక్ష్యం ఎంపీటీసీ,జడ్పీటీసీ 8 నామినేషన్ల తిరస్కరణ పొదలకూరు బిట్-2లో వైసీపీ అభ్యర్థి వాకాటి సంధ్య విస్తృత ప్రచారం భూ రీసర్వే పనులను వేగవంతం చేయాలి మొదటి దశలో ఎంపిక చేసిన 70 రెవెన్యూ గ్రామాల్లో సర్వేకు ప్రాధాన్యత ఇవ్వాలి 52వ డివిజన్ తంగవేలు కాలనీలో యువ కార్పొరేటర్ పీఎస్ చందు ప్రచారం జోరు మేయర్ గా కటారి హేమలతను భారీ మెజారిటీతో గెలిపించండి చేజర్లలో వైసీపీకి భారీ షాక్‌- టీడీపీలోకి భారీ చేరికలు వైసిపి దాడిని ఖండించిన తెలుగుదేశం పార్టీ నేత ధర్మతేజ. భీమవరంలో భారీ దొంగతనాల కేసు 24 గంటల్లో ఛేదన శ్రీనిధి అపార్ట్‌మెంట్‌లో వరుస చోరీలు.. నిందితుడి అరెస్ట్ రూ.1.08 కోట్ల విలువైన బంగారం, వెండి, నగదు స్వాధీనం ప్రశాంత వాతావరణంలో ముగిసిన అసిస్టెంట్ సైంటిస్ట్ పరీక్ష స్కౌట్ మాస్టర్లు, గైడ్ కెప్టెన్లకు శిక్షణ శిబిరాలు ఈ నెల 25 నుంచి మునిపల్లి మండలం లింగంపల్లిలో ప్రారంభం దివ్యాంగుల జీవితాల్లో వెలుగులు నింపుతున్న ‘సంకల్పం’ 100 మందికి పైగా దివ్యాంగులకు కృత్రిమ అవయవాల కోసం కొలతల సేకరణ ట్రస్ట్ సేవలు ఆదర్శనీయం: ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ బొత్స సత్యనారాయణ ఫ్యామిలీ కి షాక్.... నగరం మండలంలో ఒక్క నామినేషన్ తిరస్కరణ - డబుల్ ఎంట్రీలో 6 నామినేషన్లు తొలగింపు

మల్లారెడ్డిపల్లిలో పశువుల చోరీ

Select Suryaa Now
మల్లారెడ్డిపల్లిలో పశువుల చోరీ

నవాబుపేట సూర్య న్యూస్:మండలంలోని మల్లారెడ్డిపల్లి గ్రామ శివారులో పశువుల చోరీ ఘటన కలకలం రేపింది.శనివారం తెల్లవారుజామున గుర్తుతెలియని వ్యక్తులు ఒక ఆవు,రెండు గేదెలను అపహరించడంతో పాటు,పశువుల షెడ్డులో ఉన్న మిగతా పశువులకు ఇంజక్షన్లు ఇవ్వడంతో వాటి పరిస్థితి విషమంగా మారినట్లు సమాచారం.ఎస్సై నరేందర్ తెలిపిన వివరాల ప్రకారం..మల్లారెడ్డిపల్లి గ్రామానికి చెందిన దొన్లపల్లి రామచంద్రయ్య,దొన్లపల్లి రాజమల్లయ్య తమ పశువులను గ్రామ శివారులోని పొలంలో ఉన్న షెడ్డులో కట్టేసేవారు.శనివారం తెల్లవారుజామున రామచంద్రయ్య వరి పొలానికి నీళ్లు పెడుతుండగా పశువుల షెడ్డు వద్ద కొందరు గుర్తుతెలియని వ్యక్తులు ఉండటాన్ని గమనించాడు.దీంతో వారి వద్దకు వెళ్లేలోపే ఆ వ్యక్తులు రెండు కార్లలో పరారయ్యారు.రామచంద్రయ్య వారిని కారూరు గ్రామ శివారు వరకు వెంబడించినప్పటికీ పట్టుకోలేకపోయాడు.అనంతరం పశువుల షెడ్డుకు తిరిగి వచ్చి చూడగా ఒక ఆవు,రెండు గేదెలు కనిపించలేదు.అంతేకాకుండా షెడ్డులో ఉన్న మిగతా పశువులకు దొంగలు ఇంజక్షన్లు ఇవ్వడంతో వాటి పరిస్థితి విషమంగా మారినట్లు తెలిసింది.దీంతో బాధితుడు రామచంద్రయ్య పోలీసులకు ఫిర్యాదు చేశాడు.బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై నరేందర్ తెలిపారు.