ఎంపీటీసీ,జడ్పీటీసీ 8 నామినేషన్ల తిరస్కరణ
ఇరగవరం సూర్య న్యూస్ : ఇరగవరం 2 వ సాదారణ ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు – 2026 సంవత్సరానికి సంబంధించిన నామినేషన్ల పరిశీలన ప్రక్రియ శనివారం నిర్వహించిన్నట్లు మండల ప్రత్యేక అధికారి మరియు ఎలక్షన్ రిటర్నింగ్ అధికారి కె.వి.వి.సత్యనారాయణ చెప్పారు.ఈ కార్యక్రమంలో మండల పరిషత్ అభివృద్ధి అధికారి ఎ.శ్రీనివాస్, తహసీల్దార్ ఎమ్.సుందర్ రాజు, పాల్గొన్నారు.ఈ కార్యక్రమంలో మొత్తము 90 నామినేషన్ల పరిశీలించగా 82 నామినేషన్లను ఆమోదము పొందినట్లు చెప్పారు.మిగిలిన 8 నామినేషన్ల వివిధ కారణాల వల్ల తిరస్కరించిన్నట్లు చెప్పారు.ఎన్నికల నిబంధనలు, మార్గదర్శకాలకు అనుగుణంగా నామినేషన్ పత్రాల పరిశీలన ప్రక్రియ చేపట్టబడినట్లు చెప్పారు.. ఎన్నికల ప్రక్రియను పారదర్శకంగా,నిబంధనల ప్రకారం నిర్వహించేందుకు సంబంధిత అధికారులు అవసరమైన అన్ని చర్యలు తీసుకున్నట్లు చెప్పారు.
దాయం దొరబాబు రిపోర్టర్ ఇరగవరం పశ్చిమ గోదావరి జిల్లా